సినీ పరిశ్రమలో అడుగు పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ అడుగుపెడితే సరిపోదు.. సక్సెస్ అయితేనే.. దానికి విలువ ఉంటుంది. సినీ పరిశ్రమలో అడుగుపెట్టినందుకు ఓ అర్థం కూడా ఉంటుంది. అలా అని సక్సెస్ కూడా ఊరికే రాదు. దానికి ఎంతో శ్రమించాలి. తెలివైన డెసిషన్లు తీసుకోవాలి. అయితే కొంతమంది సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న నటీనటులను మరణం కాటు వేసింది. దీంతో వాళ్ళ బంగారు భవిష్యత్తు క్కూడా మొగ్గలోనే రాలిపోయినట్టు అయ్యింది. గత 20 ఏళ్లలో చూసుకుంటే.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 12 మంది నటీనటులు అనూహ్యంగా మరణించారు. వాళ్లలో కొంతమంది మరణాలకు సరైన కారణాలు తెలీదు. మరికొంతమంది అయితే ప్రమాదాలకు గురై లేదా అనారోగ్యం పాలై మరణించారు. ఆ నటీనటులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) దివ్య భారతి :
వరుస హిట్లతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుని బిజీ హీరోయిన్ గా రాణించిన దివ్యభారతి… 19 ఏళ్లకే మరణించింది. ఈమె 21 సినిమాల్లో నటించింది. అందులో రౌడీఅల్లుడు, బొబ్బిలిరాజా, అసెంబ్లీరౌడీ, ధర్మక్షేత్రం వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. ముంబైలో ఓ అపార్ట్‌మెంట్ పై నుండి జారిపడి అనుమానాస్పద స్థితిలో మరణించింది. చిన్న వయసులోనే ఈమె నిర్మాత సాజిద్ నడియడ్‌వాలాను ప్రేమ వివాహం చేసుకోవడం కూడా జరిగింది.
2) సౌందర్య :
కర్ణాటకకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 27 ఏళ్ళకే ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.
3) ప్రత్యూష :
అప్పుడప్పుడే హీరోయిన్ గా టాప్ ప్లేస్ కు చేరుకుంటున్న ప్రత్యూష 20 ఏళ్లకే మరణించింది. ఈమె మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీ. పెద్ద పలుకుబడి ఉన్న ఫ్యామిలీకి చెందిన యువకులు ఈమెపై అత్యాచారానికి పాల్పడినట్లు టాక్ నడిచింది. మరికొంతమంది ఈమెది ఆత్మహత్య అని చెబుతుంటారు.
4) ఆర్తీ అగర్వాల్ :
వరుస సూపర్ హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్ అయిన ఆర్తి అగర్వాల్.. ఓ హీరోతో ప్రేమలో పడి కెరీర్ ను నిర్లక్ష్యం చేసిందని వినికిడి. అదే టైంలో ఆమె షేపౌట్ అవ్వడంతో బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోవాలని విదేశాలకు వెళ్ళింది. కానీ ట్రీట్మెంట్ విఫలమవడంతో మరణించింది. 31 ఏళ్లకే ఈమె మరణించింది.
5) సిల్క్ స్మిత :
తన అందంతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన సిల్క్ స్మిత 35 ఏళ్లకే మరణించింది. అప్పట్లో ఐటెం సాంగ్ అంటే జనాలు ఈమె గురించే చెప్పేవారు. అలాంటి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయింది.
6) ఉదయ్ కిరణ్ :
కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుని సీనియర్ స్టార్ హీరోలకు దడ పుట్టించిన ఉదయ్.. ఎవ్వరూ ఊహించని విధంగా 2014 లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
7) ‘ఇష్టం’ చరణ్ :
విక్రమ్ కుమార్ మొదటి సినిమా ‘ఇష్టం’. ఈ చిత్రంలో హీరో ఇతను. నాగేశ్వర రావు గారి మనవరాలు సుప్రియ భర్త కూడా.. ! కానీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు. తర్వాత గుండెపోటుతో చరణ్ మరణించాడు. 36 ఏళ్లకే ఇతను మరణించాడు.
8) యశో సాగర్ :
కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను కారు యాక్సిడెంట్లో 2012 లో మరణించాడు. ఇతని వయసు 20 ఏళ్ళ లోపే అని సమాచారం.
9) అష్టాచెమ్మా భార్గవి:
అష్టా చమ్మా సినిమాలో నానికి చెల్లెలుగా నటించిన ఈమె 25 ఏళ్లకే మరణించింది.
10) విజయ్ సాయి :
‘అమ్మాయిలు అబ్బాయిలు’ నటుడు విజయ్ సాయి కూడా 17 ఏళ్లకే మరణించాడు.
11) కమలాకర్ :
‘అభి’ సినిమా హీరో కూడా 35 ఏళ్లకే అనారోగ్య సమస్యలతో మరణించాడు.
12) రాథామోనాల్ నావల్ :
తెలుగులో ‘ఇష్టం’ అనే మూవీలో చిన్న అతిథి పాత్ర పోషించింది. ఈమె సిమ్రాన్ చెల్లెలు. 21 ఏళ్లకే ఈమె సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంది.