Actress: స్వలింగ వివాహం న్యాయమైనదే… అంటున్న నటి!

బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళకి భూమి పెడ్నేకర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 2015లో ఎంట్రీ ఇచ్చిన భూమి పెడ్నేకర్ రెగ్యులర్ గా ఉండే రోల్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. అవసరమైతే ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ‘లస్ట్ స్టోరీస్’ లో పనిమనిషి పాత్రను పోషించి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈమె మాట్లాడే విధానం కూడా చాలా బోల్డ్ గా ఉంటుంది.

తాజాగా ఈమె (Actress) స్వలింగ వివాహానికి మద్దతు తెలుపుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 2020 లో వచ్చిన ‘బదాయి దో’లో ఈమె చేసిన లెస్బియన్ రోల్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం సుప్రీం కోర్టులో జరుగుతున్న స్వలింగ వివాహం చర్చపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ బోల్డ్ బ్యూటీ. “ఈ ప్రపంచం అందరికీ న్యాయమైన, సమానమైన ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది అందరి జీవితంలో సమానంగా ఉండాలి.

దేవుడు మనల్ని ఒకే థ్రెడ్ నుంచి సృష్టించాడు అని నేను భావిస్తున్నాను. ఒక సంఘానికి మిత్రురాలిగా దీనిపై తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే LGBTQIA + కమ్యూనిటీలో నాకు చాలా మంది మిత్రులున్నారు. ఒక చిన్న మార్గంలో వారి తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని నేను పొందడం జరిగింది. వారు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో నేను కూడా భాగమని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus