సెక్యూరిటీ గురించి ప్రముఖ హీరోయిన్‌ కామెంట్స్‌!

మహిళలు – రక్షణ.. ఈ టాపిక్‌ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దేశంలో మహిళలకు రక్షణ విషయంలో చాలా రకాల వాదనలు వినిపిస్తుంటాయి. రేప్‌, కిడ్నాప్‌, హత్య అంటూ అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాళ్ల గురించి రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. దేశంలో ఎక్కడ ఈ సమస్య ఎక్కువ అనే చర్చ కూడా ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే దిల్లీ కంటే ముంబై సేఫ్‌ అని కొత్త చర్చకు దారి తీసింది ప్రముఖ కథానాయిక సన్యా మల్హోత్రా.

మహిళల రక్షణకు సంబంధించి ఢిల్లీతో పోలిస్తే ముంబై ఉత్తమమని సన్యా మల్హోత్రా అంది. దీంతో ఆమె వ్యాఖ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె కథానాయికగా నటించిన ‘హిట్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తెలుగులో మంచి విజయం అందుకున్న ‘హిట్‌’ సినిమాకు రీమేక్‌ ఇది. ఈ సినిమా అమ్మాయిల కిడ్నాప్‌లు, హత్యల నేపథ్యంలోనే సాగుతుంది. దీంతో ఆమెను బాలీవుడ్‌ మీడియా అలాంటి ప్రశ్నే వేసింది.

‘‘నాది ఢిల్లీ కానీ, ముంబయిలోనే సేఫ్‌గా ఫీలవుతా. దేశ రాజధాని అభివృద్ధి ఎంత చెందిందో నాకు తెలియదు కానీ భద్రత మాత్రం అంతగా లేదనే చెప్పాలి. ఢిల్లీలో ఒక్క మహిళ కూడా ఆకతాయిల వేధింపులకు గురవలేదని నేను అనుకోవడం లేదు’’ అని సన్యా చెప్పుకొచ్చింది. ఢిల్లీలో జరిగే నేరాల గురించి, అక్కడి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మనం వార్తల్లో చూస్తేనే ఉంటాం. అయితే అక్కడమ్మాయే అలా మాట్లాడటంతో ఆ మాటలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక ‘హిట్‌’ గురించి చూస్తే.. విశ్వక్‌సేన్‌ హీరోగా తెలుగులో ఈ సినిమా రూపొందగా, హిందీలో రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో దర్శకత్వం వహించే శైలేష్‌ కొలనునే హిందీలోనూ తెరకెక్కించారు. ప్రమాదాలను ముందే ఊహించి, అరికట్టే హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌కి చెందిన పోలీసు అధికారిగా ఈ సినిమా రాజ్‌కుమార్‌ రావ్‌ కనిపిస్తాడు. ఈ సినిమాను జులై 15న విడుదల చేస్తున్నారు. తెలుగులో హిట్‌ కొట్టిన ‘హిట్‌’.. హిందీలో ఏమవుతుందో చూడాలి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus