సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువగా బాడీ షేమింగ్ కి గురవుతుంటారు. సోనాక్షి సిన్హా, హుమా ఖురేషి ఇలా చాలా మంది బాడీ షేమింగ్ గురించి బహిరంగంగా మాట్లాడారు. తాజాగా నటి ఎరికా ఫెర్నాండేజ్ సౌత్ సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుని మత్తెక్కిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడింది. ‘అప్పట్లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అయితే దక్షిణాది వాళ్లకు హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉంటే ఇష్టం.
సౌత్ సినిమాలు చేసినప్పుడు నేను కూడా బొద్దుగా ఉండాలని అనుకునేవారు. అయితే అప్పుడు నేను సన్నగా ఉండడంతో శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు.. అలా చేస్తుంటే నాకు సిగ్గుగా, అవమానంగా ఫీల్ అయ్యేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. ప్యాడ్స్ పెట్టుకొని నటించాలనే చాలా ఇబ్బందిగా ఉండేదని.. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనని చాలా సార్లు బాధపడ్డానని తెలిపింది. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయని.. ఇప్పుడు సౌత్ లో కూడా ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి.. బుల్లితెర నటిగా మారింది ఎరికా. ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో తమిళం, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగులో ‘గాలిపటం’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. తమిళంలో ఆమె నటించిన కొన్ని సినిమా మంచి సక్సెస్ అందుకున్నాయి. 2016లో ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ’ అనే సీరియల్ తో బాలీవుడ్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలతో బిజీగా గడుపుతోంది.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!