ఊపిరి కూడా తీసుకోలేకపోయానంటూ తన హెల్త్ కండీషన్ గురించి వివరించిన ప్రముఖ నటి..!

కొద్ది రోజుల క్రితం ‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నభా నటేష్ యాక్సిడెంట్‌కి గురైంది. అందుకే 2022లో ఆమె ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. దీని గురించి వివరంగా చెప్పుకొచ్చింది. ‘‘నేను మిమ్మల్ని మిస్ అయినట్టుగానే మీరు కూడా నన్ను మిస్ అయి ఉంటారని నాకు తెలుసు. 2022 నాకు ఎంతో కష్టంగా గడిచింది.. నాకు యాక్సిడెంట్ అయ్యింది.అవును నేను యాక్సిడెంట్ కు గురయ్యాను. నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. ఎముకలు విరిగిపోయాయి.

సర్జరీలు కూడా జరిగాయి.. శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించాను.. ఆ బాధనంతా కూడా నేను మీ ప్రేమతో జయించాను. అదేమీ అంత సులభంగా అయితే జరగలేదు. మీ ప్రేమతోనే అది సాధ్యమైంది.ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.. ఇకపై మళ్లీ సినిమాలతో మీ ముందుకు వస్తాను.. మునుపటి కంటే మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను ” అంటూ నభా నటేష్ ఓ లెటర్ ద్వారా తెలియజేసింది.. ఇప్పుడు పాపులర్ నటి మెహక్ చాహల్ తన అనారోగ్య పరిస్థితిని ప్రేక్షకులతో పంచుకుంది.

నార్వేకు చెందిన మెహక్ చాహల్ 2004లో ‘నీతో’ అనే తెలుగు సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత ఎక్కువగా హిందీ మూవీస్ చేస్తూ బిజీగా మారిపోయింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన మెహక్.. ప్రస్తుతం ‘నాగిని 6’లో నటిస్తోంది. అయితే గత కొన్నిరోజుల నుంచి న్యూమోనియాతో బాధపడ్డానని మెహక్ చెప్పుకొచ్చింది. జనవరి 2న నీరసంతో కళ్లు తిరిగి పడిపోయానని, అప్పుడు తనకు గుండెల్లో ఎవరో బలంగా అదిమినట్లు అనిపించిందని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లపాటు వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చిందని, అప్పుడు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపించిందని పేర్కొంది.

‘న్యూమోనియా ఈ మధ్య తగ్గింది. నేను కాస్త రికవరీ అయ్యాను. ప్రస్తుతం ఒంట్లో బాగానే ఉంది. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను. నాకు ఆరోగ్యం బాగోలేని సమయంలో త్వరగా కోలుకోకావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. మీ ప్రార్థనలే నాకు అండగా నిలిచాయి. అయితే నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త టైం కావాలి. త్వరలో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తాను’ అని మెహక్ చాహల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus