Actress: తను పిల్లల్ని కనాలనుకున్న వ్యక్తిని కలవలేకపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!

ఇటీవల రాజకీయాల కారణంగానే బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పానంటూ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి.. ఆమెకు వివేక్ అగ్నిహోత్రి, కంగనా రనౌత్ లాంటి వారు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం.. ప్రియాంక కావాలనే తాను బాధితురాలినని చెప్పి, అందరి మన్ననలు పొందాలని చూస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యిండి.. ఉన్నట్టుండి హాలీవుడ్‌కి ఎందుకు మారాల్సి వచ్చిందోననే ఆసక్తికర విషయాలను రీసెంట్‌గా షేర్ చేసుకుంటూ..

హిందీ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక.. ‘బాలీవుడ్‌లో కొందరు నన్ను ఓ మూలకు నెట్టేయాలని చూశారు.. నాకు ఆఫర్స్ రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఫామ్ అయింది.. అందులో భాగంగా నాకు కొందరితో విబేధాలు వచ్చాయి.. ఆ రాజకీయాలు నేను భరించలేక హాలీవుడ్‌కి వచ్చేశాను’ అని చెప్పింది.. దీనికి కారణం కరణ్ జోహార్ అంటూ కంగనా సంచలన ఆరోపణలు కూడా చేసింది.. ఇక అదే ఇంటర్వూలో తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందామె..

పిల్లల కోసం పెళ్లికి ముందే ప్లాన్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది.. ‘‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం.. ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను.. అందుకే పెళ్లికి ముందే నా అండాలను దాచి పెట్టాను.. అయితే అప్పట్లో నేను ఎవరితో పిల్లల్ని కనాలని అనుకున్నానో ఆ వ్యక్తిని కలవలేకపోయాను.. దాంతో నా అండాలను సేవ్ చేసుకోమని మా అమ్మ మధు చోప్రా (గైనకాలజిస్ట్) చెప్పింది.. అప్పుడు నా 30 ఏళ్ల వయసులో అమ్మ చెప్పినట్టే చేశాను..

నాకు (Actress) పిల్లల్ని కనాలని ఉండేది.. మరి నిక్ జోనాస్ వయసు తక్కువ కాబట్టి తనకి అప్పుడే పిల్లల్ని కనడం ఇష్టం ఉందో లేదో అని డౌట్ ఉండేది.. ఆ కారణంతోనే పెళ్లికి ముందు నిక్‌తో డేటింగ్ చెయ్యలేదు’’ అంటూ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించి మరోసారి వార్తలో నిలిచింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus