‘రాజా ది గ్రేట్’ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర హీరో రవితేజ తల్లి పాత్రే అనడంలో ఎటువంటి సందేహం. పుట్టుకతోనే అంధుడిగా పుట్టిన కొడుకుని వదిలెయ్యమని భర్త వేధిస్తున్నప్పుడు… కొడుకు కోసం భర్తనే వదిలేసి… అంధుడైన కొడుకుని హీరోని చేసే పాత్ర అది. ఆ పాత్రలో రాధిక గారు నటించారు. ఆమె నటనకి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి. అయితే ఆ పాత్ర కోసం ముందుగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతినే సంప్రదించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజ తల్లి పాత్రకి విజయశాంతిగారైతే బాగుంటుందని ఆమెను సంప్రదించాను. కానీ ఆ పాత్ర చేయడానికి ఆమె నొ చెప్పారు. దాంతో ఆ పాత్రను రాధిక గారితో చేయించడం జరిగింది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని కీలకమైన పాత్రను మాత్రం విజయశాంతిగారితోనే చేయించాలనుకున్నాను.’రాజా ది గ్రేట్’ కోసం కలిసినప్పటి పరిచయంతోనే, ‘సరిలేరు నీకెవ్వరు’ కథను విజయశాంతిగారికి వినిపించాలనుకున్నాను. ‘స్వాతిముత్యం’లో సోమయాజులు చుట్టూ కమల్ తిరిగినట్టు నేను ఆమె ఇంటి చుట్టూ తిరిగాను. కథ మొత్తాన్ని ఆమె నవ్వుతూనే విన్నారు .. ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.