దర్శకులపై కొంతమంది నటీమణులు తీవ్ర ఆరోపణలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది వారిని శారీరకంగా వాడుకున్నారని, మరికొంతమంది నాకు చెప్పిన పాత్ర ఒకటి.. తర్వాత నాకు ఇచ్చిన పాత్ర ఒకటి అని.. ఆ పాత్ర చేయడం వల్ల నా ఇమేజ్ దెబ్బతిందని కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం కొంచెం భిన్నంగా ఉంటుంది. బాలీవుడ్ నటి రితుపర్ణ సేన్‌గుప్తా తెలుగు వాళ్లకు పెద్దగా తెలిసుండదు. 1995 వ సంవత్సరంలో ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఘటోత్కచుడు’ సినిమాలో చిన్న స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చింది ఈ బ్యూటీ.
52 ఏళ్ళ వయసొచ్చినా ఈమె (Actress) అందం చెక్కు చెదరలేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈమె యమ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకి కూడా నిద్రలేకుండా చేస్తుంటుంది. అనేక హిందీ, బెంగాలీ సినిమాల్లో కూడా ఈమె నటించింది. తాజాగా దర్శకుడు మధుర్ భండార్కర్ తన సినిమాల్లో నటీనటులను ఎలా వాడుకుంటాడో తెలుసా అంటూ రితుపర్ణ సేన్‌గుప్తా చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.
మధుర్ దర్శకత్వం వహించిన ‘దిల్ తో బచ్చా హై జీ’ చిత్రంలో ఈమె సహాయనటి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి ముందు చెప్పిన దాని కంటే కూడా ఎక్కువగా ఉపయోగించుకున్నాడని ఆమె తెలిపింది. తన యాక్టింగ్ స్కిల్స్ గురించి భండార్కర్ కు బాగా తెలుసని, దీంతో అజయ్ దేవగన్ కు భార్యగా తనను భాగస్వామ్యం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడని ఆమె చెప్పింది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!