Rajinikanth: రజినీ కాంత్‌ పక్కన నటించడం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ హీరోయిన్..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్.. దేశ విదాశాల్లో ఆయనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా కనీసం ఆయనతో ఒక్క సీన్ లేదా షాట్‌లో కలిసి కనిపిస్తే చాలు జన్మ ధన్యమైపోతుంది అనుకునే నటీనటులు ఎంతోమంది ఉన్నారు.. కట్ చేస్తే.. ఒకప్పటి స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ మాత్రం తలైవాతో  సినిమా చేసిన తర్వాత తన కెరీర్ ముగిసిపోయింది అంటే షాకింగ్ కామెంట్స్ చేశారు..

ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ భామ మనీషా కోయిరాలా.. ‘బాంబే’, ‘భారతీయుడు’, ‘ఒకేఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తమిళ్ ఫిలింస్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుందామె.. అయితే రజినీకి జోడీగా ‘బాబా’ మూవీ చేసింది.. ఆ తర్వాత తమిళంలో అవకాశాలు రాలేదు.. ‘బాషా’ ఫేమ్ సురేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా.. స్వయంగా రజినీ కథ అందించి, నిర్మించారు.. ఎంతో భారీగా తెరకెక్కించిన ‘బాబా’ అంతే భారీ అంచనాలతో వచ్చి.. ఊహించని ఫలితాన్నిచ్చింది.. ఇక దీని గురించి ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడారు మనీషా..

‘‘బాబా’(Rajinikanth) నా లాస్ట్ తమిళ్ ఫిలిం.. ఆ రోజుల్లో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.. ఇక సౌత్‌లో నా కెరీర్ ముగిసినట్లే అనుకున్నా.. చివరికి నేను ఊహించిందే జరిగింది.. ‘బాబా’ తర్వాత నాకు కోలీవుడ్‌లో ఆఫర్స్ రాలేదు.. అదేంటోకానీ విచిత్రంగా రీ రిలీజ్ చేసినప్పుడు మాత్రం హిట్ అయ్యింది’’ అని చెప్పుకొచ్చారు.. ఇక క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం ‘బాంబే’ సినిమా చేయకూడదనుకున్నా.. అప్పుడే తల్లి పాత్ర చేస్తే కెరీర్ దెబ్బతింటుందని చాలామంది హెచ్చరించారు..

కెమెరామెన్ అశోక్ మెహతా.. నీకు మణిరత్నం గురించి, ఆయన సినిమాల గురించి ఏమైనా తెలుసా?.. ఆయన సినిమా వద్దనుకున్నావంటే నీకంటే పిచ్చోళ్లు ఎవరూ ఉండరు.. అని తిట్టారు.. దీంతో నా నిర్ణయాన్ని మార్చుకుని అమ్మతో పాటు చెన్నై వెళ్లి ‘బాంబే’ సినిమాలో నటించాను.. ఆ సినిమా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు మనీషా కోయిరాలా..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus