Bhola Shankar: ‘భోళా శంకర్’ పైనే ఆశలు పెట్టుకున్న యాంకరమ్మ..!

‘వాల్తేరు వీరయ్య’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నిజానికి ఈ సినిమా పై చిరంజీవి అభిమానులకు ఎటువంటి హోప్స్ లేవు. ట్రేడ్ పండితులు కూడా ఈ సినిమా ఎక్కువ బిజినెస్ చేస్తుంది అని అంచనా వేయలేకపోతున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మరోపక్క ఆయన ‘ఏజెంట్’ అనే భారీ బడ్జెట్ సినిమాని కూడా నిర్మిస్తున్నారు.

ఆ సినిమా వల్ల నలిగిపోతున్న ఆయన ‘భోళా శంకర్’ చిత్రాన్ని కొన్ని రోజుల పాటు ఆపేయడం కూడా జరిగింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాలో శ్రీముఖి కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఓ రకంగా ఆమెకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ‘ఖుషి’ లో పవన్ కళ్యాణ్, భూమిక ల మధ్య చిత్రీకరించిన నడుము సీన్ మెగాస్టార్, శ్రీముఖి లపై చిత్రీకరించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇలాంటి స్పూఫ్ సీన్లు వర్కవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి.

అంతే కాకుండా ఈ సినిమాలో చిరు పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. చిరు రేంజ్ కి పవనే నా అభిమాని అని వాళ్ళ అభిమానులకు కౌంటర్ ఇచ్చినట్టు సన్నివేశాలు ఉండాలి. కానీ ఇక్కడ మెహర్ కాబట్టి.. ఆ స్థాయిలో ఆలోచించలేడు. ఇక చిరు కూడా తమ్ముడి ప్రేమతో ఆ మాట కూడా చెప్పలేరు. సరే ఈ సినిమా శ్రీముఖి సినీ కెరీర్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఆమెకు సినిమాల్లో బిజీగా రాణించాలి అనే ఆశ ఎక్కువ.

అందుకోసమే తన పుట్టినరోజుకి ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ కు, ఫిలిం క్రిటిక్స్ కు లక్షల్లో ఖర్చు చేసి పార్టీలు ఇస్తుంటుంది. ‘మాస్ట్రో’ వంటి సినిమాల్లో శ్రీముఖికి అవకాశాలు వచ్చాయి కానీ అవి ఒకటి రెండు నిమిషాల సన్నివేశాలే. ఆ సన్నివేశాల కోసమే ఈమె బుల్లితెర పై చేస్తున్న షోల షూటింగ్ లు క్యాన్సిల్ చేసుకుని మరీ సినిమా సెట్స్ కు వెళ్తుంటుంది. మరి ‘భోళా శంకర్’ ఈమె కెరీర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus