రోజు గడిచే కొద్దీ ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని సినీ వర్గాల వారు టెన్షన్ పడుతున్నారు.. వరుస మరణాలతో చిత్ర పరిశ్రమ కుదేలవుతోంది.. వృద్ధాప్య కారణాలతో సీనియర్లు, ఊహించని విధంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కళాకారులు, సాంకేతిక నిపుణులు కన్నుమూయడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే..కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు,
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్, హాలీవుడ్ ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్, ‘హ్యారీ పోటర్’ ఫేమ్ పాల్ గ్రాంట్ తదితరులు మరణించారు.. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి కన్నుమూశారనే వార్తతో పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.. బుల్లితెర హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు కోవై గుణ మంగళవారం తుది శ్వాస విడిచారు..
ఆయన గత ఏడాదిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. గుణ మొదట విజయ్ ఛానల్‌లో ప్రసారమైన ‘కలక్క పోవదు యారు’ షోలో తన మిమిక్రీ, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఆ తర్వాత సన్ టెలివిజన్ షో ‘అసత పోవదు యారు’ లో చేసిన మిమిక్రీకి గానూ మంచి గుర్తింపు వచ్చింది.. శివాజీ గణేశన్, హాస్య నటులు గౌండమణి, జనగరాజ్ మరియు దివంగత తమిళ నటుడు ఎంఆర్ రాధల వాయిస్‌లను గుణ బాగా అనుకరించేవారు..
మిమిక్రీతోనే సినిమా అవకాశాలు దక్కించుకున్నారు.. ఆయన చనిపోయాడనే వార్తతో తమిళ పరిశ్రమతో పాటు కామెడీ అభిమానులు కూడా షాక్‌కి గురయ్యారు.. అయితే కోవై గుణ చెడు వ్యసనాలకు బానిసగా మారి జీవితాన్ని నాశనం చేసుకున్నారని మరో కోలీవుడ్ కమెడియన్ మదన్ బాబు చెప్పారు..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?