రోజు గడిచే కొద్దీ ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని సినీ వర్గాల వారు టెన్షన్ పడుతున్నారు.. వరుస మరణాలతో చిత్ర పరిశ్రమ కుదేలవుతోంది.. వృద్ధాప్య కారణాలతో సీనియర్లు, ఊహించని విధంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కళాకారులు, సాంకేతిక నిపుణులు కన్నుమూయడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే..కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్, హాలీవుడ్ ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్, ‘హ్యారీ పోటర్’ ఫేమ్ పాల్ గ్రాంట్, కోలీవుడ్ కమెడియన్ కోవై గుణ, రష్యన్ పాప్ సింగర్ దిమా నోవా తదితరులు మరణించారు
తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు.. ఆయన వయసు 67 సంవత్సరాలు.. గతకొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 24) తెల్లవారు ఝామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.. ఈ విషయాన్ని ఆయన బంధువు, కథానాయిక నీతూ చంద్ర సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.. కాగా ప్రదీప్, దర్శకుడిగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తెరకెక్కించడంతో కెరీర్ స్టార్ట్ చేసి.. ‘పరిణీతి’, ‘హెలికాప్టర్ ఈల’, ‘మర్దానీ’ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు..
గత కొంతకాలం నుంచి ఆయన మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ప్రదీప్.. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్నారు.. ఇటీవలే పొటాషియం లెవెల్స్ క్రమంగా పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.. తన సినీ కెరీయర్ ఆయన సినిమాతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు నీతూ చంద్ర.. ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని ఆయన సోదరి మాధురి కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. ప్రదీప్ మృతి పట్ల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ విచారం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అలానే ప్రదీప్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు..
The news of Pradeep Sarkar’s demise, ‘Dada’ to some of us is still hard to digest.
My deepest condolences . My prayers are with the departed and his family. RIP Dada
Dada, you will be missed. Your sense of humor, humility and all the work you put into your films will always be remembered
RIP pic.twitter.com/WApkIVQFcO