తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ ‘సఖి’ మూవీ రిలీజ్ అయ్యి ఈరోజుతో 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో ‘అలైపాయుధె’ పేరుతో ఈ మూవీని తెరకెక్కిస్తున్న మణిరత్నం గారికి ఈ మూవీని తెలుగులో విడుదల చేయాలి అనే ఆలోచన లేదు. కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకుని విడుదల చేశారు.
2000 వ సంవత్సరం ఏప్రిల్ 14న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. యూత్ కు ఈ మూవీ బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్లే..! ఈ మూవీలో ప్రతీ సన్నివేశం సహత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి ప్రేమకథలు తీయడం మణిరత్నంకి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు అనే స్థాయిలో దేనిని తెరకెక్కించారు. అయితే ఇలాంటి సూపర్ హిట్ మూవీని ఇద్దరు స్టార్లు రిజెక్ట్ చేశారట. ఈ మూవీలో హీరోగా మాధవన్ నటించాడు.
ఆయన్ని తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేసిన మూవీ కూడా ఇదే. అయితే దర్శకుడు మణిరత్నం ఈ మూవీలో హీరోగా మొదట మాధవన్ ను అనుకోలేదట. ముందుగా ఈ మూవీలో హీరోగా అబ్బాస్ ను అనుకున్నారట. ఆ టైములో అబ్బాస్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అతనికైతే ఈ కథ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని అతను అనుకున్నాడట. కానీ అబ్బాస్ ఆ టైంకి నరసింహ, రాజా వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ బిజీగా గడుపుతున్నాడు.
దాంతో ఈ మూవీని రిజెక్ట్ చేసాడట అబ్బాస్. హీరోగా అతని టైం ముగుస్తున్న రోజులవి. ఈ మూవీ కనుక చేసి ఉంటే కచ్చితంగా అతను మరికొన్నాళ్ళు హీరోగా కొనసాగేవాడేమో. ఇక హీరోయిన్ గా కూడా మొదట షాలినిని అనుకోలేదట మణిరత్నం. రజినీకాంత్ కూతురు.. ధనుష్ మాజీ భార్య అయిన ఐశ్వర్యని అనుకున్నాడట. కొన్ని కారణాల వల్ల ఈ మూవీలో ఆమె నటించలేదు. నటి అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా ఆ టైములో ఆమెకు లేదట.