Star Hero: సీనియర్ హీరో కూతురు, అల్లుడు గురించి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్ కామన్ అయిపోయాయి.. ఎంత త్వరగా రిలేషన్ స్టార్ట్ చేసి.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారో.. అంతే త్వరగా విడిపోతున్నారు.. సెలబ్రిటీల వ్యవహారం చూసి.. వీళ్లకి ప్రేమ, పెళ్లి అంటే ఎంత చులకన అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో ఈ తరహా వ్యవహారాలు కొంచెం ఎక్కువనే చెప్పాలి.. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని.. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన కపుల్ కాస్తా.. నీ దారి నీది.. నా దారి నాది అంటూ తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు.. ఇంకో హైలెట్ ఏంటంటే.. వివాహం చేసుకుని దశాబ్దాల పాటు కాపురం చేసి.. పిల్లలు పెళ్లీడుకి వచ్చిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు..

సెలబ్రిటీలు విడిపోయారనే వార్తల్లో సోషల్ మీడియా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది.. కాపురాలు నిలబెట్టడం, చెడగొట్టడం లాంటి విషయాల్లో దీనిదే ప్రధాన పాత్ర అన్నట్టు తయారయింది పరిస్థితి.. మొగుడు పెళ్లాల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ చూసి.. వాళ్ల మధ్య రిలేషన్ ఎలా ఉంది.. అసలు కలిసే ఉంటున్నారా, లేదా? అనే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. పొరపాటున వైఫ్ అండ్ హస్బెండ్ కాస్త దూరంగా ఉన్నారంటే ఇక అంతే సంగతులు.. రకరకాల పుకార్లు షికార్లు చేసేస్తుంటాయి..

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.. ఓ సీనియర్ హీరో (Hero) కూతురు.. తండ్రి సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటుంది.. త్వరలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయనుందని టాక్.. ఇక ఆమె భర్త తన వ్యాపారాలు, వ్యాపకాల కారణంగా వేరే ఊళ్లో ఉంటూ పలు ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు.. దీంతో సదరు సెలబ్రిటీ కపుల్ మధ్య ఏదో జరిగింది అంటూ రూమర్స్ ఊపందుకున్నాయి..

దీనికి ఇంకో కారణం ఏంటంటే.. ఆ భర్త.. గత ఆరునెలలుగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో వైఫ్‌కి సంబంధించిన పిక్స్ ఏవీ పోస్ట్ చేయలేదంట.. పైగా ఇటీవల ఆ కుటుంబంలో విషాదం జరిగితే కూడా ఆయన రాలేదు.. ఎందుకంటా? అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు.. పైగా ఆ ఫ్యామిలీకి పెద్దదిక్కు లాంటి వ్యక్తి భార్యభర్తలిద్దర్నీ కూర్చోబెట్టి మంచీ చెడూ చెప్పి పంపారని సమాచారం..

ఇంత జరిగిందా?.. అసలేంటి మేటర్ అని ఆరా తీస్తే.. ఆ మొగుడు పెళ్లాల మధ్య అలాంటి సమస్యలేం లేవట.. ఎవరి పనుల్లో, వ్యాపారాల్లో వారు బిజీగా ఉన్నారని.. ఆమె త్వరలోనే భర్త పేరు మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది.. మరి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయోనంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus