హేటర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో

సల్లూ భాయ్ కి కోపం వచ్చింది. ఆయన ట్విట్టర్ ద్వారా తన హేటర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఉదంతం జరిగిన నాటి నుండి బాలీవుడ్ లో కొందరు పెద్ద తలకాయలను నెటిజన్స్ విపరీతంగా విమర్శిస్తున్నారు. అలాగే మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. దీనిపై చాలా కాలంగా సల్మాన్ మౌనంగా ఉన్నారు. అలాగే తన ఫ్యాన్స్ ని కూడా సంయమనంతో ఉండాలని, ఎవరినీ ఏమి అనవద్దని కూడా పిలుపునిచ్చాడు.

కాగా కొద్దిరోజుల క్రితం సల్మాన్ తన ఫార్మ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్న ఫోటోలు ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆలాగే అందరు ఫార్మర్స్ కి సెల్యూట్ అని చెప్పడం జరిగింది. సల్మాన్ రైతు గెటప్ లో పంచుకున్న ఆ ఫోటోలను నెటిజెన్స్ విపరీటంగా ట్రోల్ చేశారు. దీనిపై సల్మాన్ ఖాన్ కి కోపం వచ్చింది. ట్విట్టర్ లో ఆయన హానెస్ట్ ఒపీనియన్స్, హెల్తీ క్రిటిసిజం అంగీకరిస్తాం, అలాగని అర్థం పర్థం లేని ఆరోపణలతో టార్గెట్ చేస్తే..ట్విట్టర్ లోకి వచ్చి కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు.

ఓ స్టార్ హీరో ఈ స్థాయిలో విరుచుకు పడడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ వార్నింగ్ పై నెటిజెన్స్ అదే స్థాయిలో విరుచుకు పడడం విశేషం. ఆయన ట్విట్టర్ పోస్ట్ కి నెటిజెన్స్ అనేక మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ మానసిక వేదన వెనుక సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారని నెటిజెన్స్ బలంగా నమ్ముతున్నారు.


చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus