మహేష్ బాబు కెరీర్లో డిజాస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి.భారీ అంచనాలు ఏర్పడడం లేదా రాంగ్ టైం లో రిలీజ్ అవ్వడం వలన అతని సినిమాల్లో కొన్ని పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ప్లాప్ అయ్యాయి. ‘టక్కరి దొంగ’ ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవే ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ …! ఈరోజు ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలయ్యి 5 ఏళ్ళు కావస్తోంది కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం.
‘శ్రీమంతుడు’ తో బ్లాక్ బస్టర్ కొట్టి కం-బ్యాక్ ఇచ్చిన మహేష్ బాబుని మళ్ళీ రెండేళ్ళ పాటు షెడ్డుకి పంపించిన సినిమా ఇది. మహేష్ బాబు అభిమానులు సైతం ఈ సినిమాని థియేటర్లలో పూర్తిగా చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదట. మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంటే మహేష్ వచ్చి చేరాడట. ‘బ్రహ్మోత్సవం’ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో మరెవరో కాదు ఎన్టీఆర్. అవును దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదట ఈ కథని ఎన్టీఆర్ కు వినిపించాడు.
అతను ఓకే కూడా చెప్పాడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అయ్యాడు. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ స్క్రిప్ట్ ను తొందరగా రెడీ చేయలేదట. దాంతో ఎన్టీఆర్ కు ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఇష్టం లేక.. సుకుమార్ దగ్గర ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ కథని ఫైనల్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. అలా ‘బ్రహ్మోత్సవం’ నుండీ ఎన్టీఆర్ ఎస్కేప్ అయితే మహేష్ బాబు బుక్కైపోయినట్టు స్పష్టమవుతుంది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!