Skanda: స్కంద సినిమాను రిజెక్ట్ చేసిన ప్రముఖ హీరో అతనేనా?

  • August 29, 2023 / 11:24 AM IST

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. స్కంద సినిమా ట్రైలర్ కు ఇప్పటివరకు 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ స్థాయిలో వ్యూస్ రావడంతో పాటు ఇతర భాషల్లో సైతం వ్యూస్ విషయంలో స్కంద మూవీ ట్రైలర్ అదరగొడుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

అయితే స్కంద (Skanda) మూవీ కథను బోయపాటి శ్రీను మొదట మహేష్ బాబుకు చెప్పారని మహేష్ వేర్వేరు కారణాల వల్ల రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. మహేష్ కు ఈ కథ ఎంతగానో నచ్చిందని అయితే ఇప్పటికే వేర్వేరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో స్కంద విషయంలో వెనక్కు తగ్గిందని సమాచారం అందుతోంది. స్కంద మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా కోసం 60 నుంచి 65 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైంది.

శ్రీనివాస చిట్టూరి, జీ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. వరుసగా భారీ సినిమాలతో శ్రీనివాస చిట్టూరి కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. రామ్ తో ది వారియర్ సినిమాను నిర్మించిన ఈ నిర్మాత రామ్ తోనే మరో సినిమాను నిర్మించడం గమనార్హం. రామ్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ పారితోషికం ప్రస్తుతం 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రామ్ ప్రాజెక్ట్ లన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను స్కంద సినిమాతో అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్కంద సినిమాలోని డైలాగ్స్ హైలెట్ గా ఉన్నాయి. స్కంద సినిమాలోని యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. స్కంద సినిమా కోసం రామ్ ఎంతో కష్టపడ్డారు. రామ్ నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus