Nayanthara: నయన్ తో జాగ్రత్త… విగ్నేష్ కు హెచ్చరికలు జారీ చేసిన షారుక్!

షారుక్ ఖాన్ ఐదు సంవత్సరాలుగా ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఈ ఏడాది పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించారు. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి షారుఖ్ ఖాన్ త్వరలోనే జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించబోతున్నారు అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి నయనతార విజయ్ సేతుపతి వంటి వారు కూడా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే షారుఖ్ నయనతార భర్త విగ్నేష్ కి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

జవాన్ ట్రైలర్ చూసినటువంటి నయనతార భర్త విగ్నేష్ ఈ ట్రైలర్ పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అట్లీ ఇలాంటి సూపర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటే గర్వపడకుండా ఎలా ఉండగలం అవుట్ ఫుట్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందని తెలిపారు. అలాగే ఈ సినిమా ద్వారా నయనతార విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ వారికి ఆల్ ద బెస్ట్ తెలిపారు.

ఈ విధంగా విగ్నేష్ చేసినటువంటి ఈ ట్వీట్ పై షారుఖ్ ఖాన్ స్పందించారు. విగ్నేష్ శివన్ ఈ సినిమా ట్రైలర్ పై స్పందించిన తీరుకు షారుక్ ఖాన్ కృతజ్ఞతలు తెలపడమే కాకుండా నయనతార పట్ల జాగ్రత్తగా ఉండమని విగ్నేష్ కు హెచ్చరికలు కూడా జారీ చేశారు. నయనతార కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది మీరు జాగ్రత్తగా ఉండండి అయినా ఈ విషయం మీకు ముందే తెలుసు అనుకుంటాను అంటూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus