‘డై హార్డ్’ లాంటి సినిమాతో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్. యాక్షన్ సినిమాలతో హాలీవుడ్‌లో అగ్ర హీరో అయిపోయాడు. అలాంటి విల్లీస్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఫ్రోంటో టెంపోరల్ డిమెన్షియా (ఎఫ్‌టీడీ) అనే వ్యాధితో పోరాడుతున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు దీని గురించి ఆయన భార్య హెమింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. విల్లీస్‌పై ఈ వ్యాధి ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, దాని వల్ల తమ జీవితాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చెప్పారు.
హెమింగ్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె మాటలు విని, విల్లీస్ కష్టాల గురించి తెలుసుకుని నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డిమెన్షియా అనేది వయసు పైబడిన వారికి వచ్చే వ్యాధి. అయితే ఫ్రోంటో టెంపోరల్ డిమెన్షియా రకం మధ్య వయసులో ఉన్నవారికి కూడా వస్తుంటుంది. ఇప్పుడు విల్లీస్ విషయంలో ఇదే జరిగింది అని హెమింగ్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె కొన్ని బరువైన మాటలు చెప్పారు. అవి చాలామందిని ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నాయి. గతంలోనూ ఆమె ఇలా ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు మాట్లాడటం రెండోసారి.
మా జీవితాన్ని జీవించడానికి రోజూ కష్టపడాల్సి వస్తోంది. మా పరిస్థితి ఇప్పుడేం బాలేదు. నా కోసం, మా కుటుంబం కోసం నేను ముందుకు సాగుతున్నాను. మనల్ని మనం బాగా చూసుకోలేకపోతే, మనం ప్రేమిస్తున్న వారిని కూడా చూసుకోలేం. అందుకే నా శక్తికి మించి నా కుటుంంబం కోసం కష్టపడుతున్నాను. అంతే కాకుండా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా బిజీ రోజుల నుండి బయటికొచ్చి జీవితంలో ఉండే ఎంతో అందమైన విషయాలపై ఫోకస్ చేయాలని కోరారు.
విల్లీస్ ఆరోగ్యం గురించి హెమింగ్ ఓపెన్‌గా మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. 2022 మార్చిలో (Star Hero) విల్లీస్‌కు ఎఫ్‌టీడీ ఉన్న విషయం బయటపడినప్పుడు కూడా ఆమె మాట్లాడారు. విల్లీస్, హెమింగ్‌కు మేబుల్ (11), ఎవిలిన్ (9) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక విల్లీస్‌కు, తన మాజీ భార్య డెమీ మూర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు.