టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కో సినిమాను పూర్తి చేయడానికి సంవత్సరాల సమయం పడుతోంది. టాప్ డైరెక్టర్లు సైతం ఒక్కో సినిమాను సంవత్సరాల తరబడి చెక్కుతున్నారు. అయితే మోహన్ లాల్ మాత్రం సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. కేవలం 44 రోజుల్లోనే బ్రో డాడీ సినిమాను పూర్తి చేశారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ కలయికలో మొదట లూసిఫర్ సినిమా వచ్చింది.
లూసిఫర్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో రీమేక్ అవుతోంది. లూసిఫర్ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా రికార్డ్ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశారు. మీనా, కళ్యాణి ప్రియదర్శన్ లూలూ అలెక్స్, ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో ప్రస్తుతం మోహన్ లాల్ నంబర్1 హీరోగా ఉన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా ఏకంగా ఏడు సినిమాలు తెరకెక్కుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమార్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలు కూడా తక్కువ రోజుల్లో సినిమాలు తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల నిర్మాణ వ్యయం నుంచి 30 నుంచి 50 శాతం పెరుగుతోంది. మోహన్ లాల్ ను చూసైనా టాలీవుడ్ హీరోలు మారతారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్స్ పారితోషికాలు, షూటింగ్ డేస్ ను తగ్గించుకుంటే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కరోనా వల్ల నిర్మాతలకు నష్టాలు వస్తున్న నేపథ్యంలో హీరోలు సినిమా ఖర్చును తగ్గించుకుంటే మంచిది.