అప్పుడు సుకుమార్.. ఇప్పుడు త్రివిక్రమ్..?

సాధారణంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే. గతంలో స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చేవారు. అయితే కాలంతో పాటే ప్రొడ్యూసర్లు, హీరోలు సైతం మారారు. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా హీరోలు కథ నచ్చితే మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథపై ఏ మాత్రం సందేహం వచ్చినా హీరోలు ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడానికి వెనుకాడటం లేదు.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 2018 సంవత్సరంలో రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చాయి. రంగస్థలం లాంటి హిట్ ఇచ్చినా మహేష్ బాబు సుకుమార్ కథను నమ్మకపోవడంతో ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తరువాత అల్లు అర్జున్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్న సుకుమార్ ప్రస్తుతం బన్నీతో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.

అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించాలని భావించగా ఎన్టీఆర్ కు కథ నచ్చకపోవడం, ఇతర కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. సినిమాల బడ్జెట్ లు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదని అందువల్లే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకులను సైతం నమ్మడం లేదని తెలుస్తోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus