Rajamouli Health Problem: రాజమౌళి ఆ వ్యాధితో బాధపడుతున్నాడన్న సంగతి మీకు తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లి.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు. ‘బాహుబలి'(సిరీస్) ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి సినిమాలు వరల్డ్ వైడ్ గా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఈ మధ్యనే జపనా లో కూడా రిలీజ్ అయ్యి.. అక్కడ ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట స్లోగా స్టార్ట్ అయినా తర్వాత స్టడీగా కలెక్షన్లు రాబట్టి..

అక్కడ టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. త్వరలోనే రజనీకాంత్ ముత్తు పేరుపై ఉన్న రికార్డును కూడా చెరిపేసి టాప్ 1 ప్లేస్ లో ఆర్.ఆర్.ఆర్ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. మార్చి 25న తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ..వరల్డ్ వైడ్ గా రూ.1160 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించింది. అయితే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కలెక్షన్లను మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. అలా అని ‘బాహుబలి2’ కలెక్షన్లతో సాధించిన రికార్డు వేరే సినిమా టచ్ చేయలేకపోయింది.

ఇదిలా ఉండగా.. రాజమౌళి సెట్ లో పనిరాక్షసుడుగా ప్రవర్తిస్తాడు అని అంతా చెబుతుంటారు. షాట్ పెర్ఫెక్ట్ గా రావడానికి ఆయన ఓ రాక్షసుడిలా మారిపోతాడు అంటూ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. రాజమౌళి ఓ అనారోగ్య సమస్యతో కూడా బాధపడుతున్నాడట. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఈ విషయాన్ని రివీల్ చేసింది స్టార్ హీరోయిన్ శ్రీయ.

‘ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్‌ కు ముందు రాజమౌళి ఆస్తమాతో బాధపడుతున్నారు. కానీ ఆయన షూటింగ్ ను మాత్రం ఆపేవారు కాదు. సెట్స్‌ లో ఎంత దుమ్ము ఉన్నా.. అదే ఎనర్జీతో పని చేసేవారు. ఆయన దృష్టి మొత్తం సినిమాని ఎంత బాగా ప్రెజెంట్‌ చేయాలి అనే దానిపైనే ఉండేది. వెండితెరపై సినిమా అద్భుతంగా రావాలనే తాపత్రయపడుతుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది. శ్రీయ కామెంట్స్ అందరికీ షాకిచ్చాయనే చెప్పాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus