2014 సంవత్సరంలో ఫగ్లీ అనే హిందీ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు కియారా అద్వానీ. ఆ సినిమా తరువాత ఎం ఎస్ ధోని, మెషీన్ సినిమాల్లో నటించిన కియారా 2017 సంవత్సరంలో విడుదలైన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. అందం, అభినయం పుష్కలంగా ఉన్న కియారా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. లస్ట్ స్టోరీస్ సినిమాతో కియారా బోల్డ్ రోల్స్ లో కూడా నటించగలనని ప్రూవ్ చేసుకున్నారు.
భరత్ అనే నేను సినిమా తరువాత వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన కియారా నటించారు. ఆ సినిమాలో కియారా పాత్రకు మంచి పేరే వచ్చినా ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత కియారాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కియారాను ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కియరా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే కియారా ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పినా రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే కియారా ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ అయినట్టు ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే కియారా ఎన్టీఆర్ కు నో చెప్పి రామ్ చరణ్ కు ఓకే చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కు కియారా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నో చెప్పిందా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? తెలియాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో కియారా అద్వానీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.