సామాజిక మాధ్యమాలలో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన వార్తల మామూలుగా వైరల్ అవ్వవసలు.. లవ్, రిలేషన్, బ్రేకప్, పెళ్లి, ప్రెగ్నెన్సీ.. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు సదరు స్టార్స్ ట్రెండ్ అవుతుంటారు.. ఇక విడాకుల వ్యవహారంలో బాలీవుడ్ ఇండస్ట్రీదే పైచేయి అని చెప్పాలి.. నవాజుద్దనీ సిద్ధిఖీ ఆయన భార్య మేటర్ ఇంకా నడుస్తూనే ఉంది.. ఇటీవలే విద్యుత్ జమ్వాల్ డేటింగ్ చేస్తున్న తన ప్రేయసితో నిశ్చితార్థం జరిగాక కూడా వదిలి పెట్టేశాడు..
కొన్నేళ్ల పాటు కాపుంరం చేసి విడిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, తేరుకుని బౌన్స్ బ్యాక్ అవడం, మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం లాంటివి చాలా తక్కువమంది జీవితాల్లో మాత్రమే జరుగుతుంటాయి.. ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత ఆ బంధాలు, బంధీఖానాలు మనకొద్దు బాబోయ్ అంటూ ఒంటరిగా ఉండిపోయిన వాళ్లూ ఉన్నారు.. అయితే ఓ హీరోయిన్ మాత్రం.. ప్రేమించిన వాడిని మ్యారేజ్ చేసుకుని 14 సంవత్సరాలు కాపురం చేసి 11 ఏళ్ల క్రితం విడిపోయిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. ‘
షాదీ మాటే వద్దు గురూ.. సోలో లైఫే సో బెటర్’ అంటూ పాట పాడుకుంటూ సోలోగా ఎంజాయ్ చేస్తోంది.. ఆ నటి ఎవరంటే.. ఆశా జయన్.. రీసెంట్‌గా ఆమె మాట్లాడుతూ.. ‘నా చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తుంటే ఒంటరిగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది.. నేనైతే సింగిల్‌గా హ్యాపీగా ఉన్నాను.. కాకపోతే గతంలో కలిసి కాఫీ తాగడం, ముచ్చట్లు పెట్టడం లాంటి కొన్ని స్పెషల్ మూమెంట్స్‌ని మాత్రం మిస్ అవుతున్నాను అనిపించేది కానీ వాటిని నా ఫ్యామిలీ ఫుల్ ఫిల్ చేసింది’’ అని చెప్పుకొచ్చింది..
1998లో మోడల్ ఫైజల్‌ను పెళ్లి చేసుకుంది ఆశా.. ఇద్దరూ కలిసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా పెట్టారు.. తర్వాత విభేదాలు రావడంతో 2012లో విడిపోయారు.. ఇక బెంగాలీ నటి అయిన ఆశా జయన్, కోకోకోలా యాడ్, పంచమి సీరియల్ అలాగే పలు బెంగాలీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?