చేతిలో చిల్లి గవ్వ లేక .. దారుణమైన పరిస్థితుల్లో నిర్మాత.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరో!

సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు.. చివరి రోజుల్లో కనీసం తినడానికి తిండిలేక , ఆరోగ్యం కూడా పాడైపోయిన స్థితిలో ఉన్నవారిని చాలా మందిని చూశాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారి లిస్ట్ చాలానే ఉంది. రమాప్రభ, శ్యామల వంటి వారి పరిస్థితి కూడా చాలా వరకు ఇలాంటిదే. ఈ లిస్ట్ లో ప్రముఖ కోలీవుడ్ నిర్మాత వి. ఏ. దురై కూడా ఉన్నట్టు బయటపడింది.

ఈయన అల్లాటప్పా నిర్మాత కాదు. రజినీకాంత్ , విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్య రాజ్ వంటి బడా స్టార్స్ తో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు వి. ఏ. దురై. కొన్నాళ్లుగా ఈయన షుగర్ వ్యాధి బారినపడి ఇప్పుడు ఘోరమైన స్థితిలో ఉన్నారు. వైద్యం కోసం కనీస డబ్బులు లేక ఈయన మంచాన పడి ఉన్నారు. ఆయన సన్నిహితులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… విషయం తెలుసుకున్న స్టార్ హీరో సూర్య..

నిర్మాత దురైకి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇది మాత్రమే కాదు ఆయనకు అవసరమైన మొత్తాన్ని తాను ఇస్తానని తెలిపాడు సూర్య. సూర్య ఈ స్టెప్ తీసుకోవడంతో తమిళ సినీ ప్రముఖుల్లో ఎంతో మంది దురైకి సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. పితామగన్, సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దురై.. ఎన్నమ్మా కన్ను, వివరమనా ఆలు, లూఠీ, గజేంద్ర వంటి సినిమాలు చేసి టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. ఆ తర్వాత ఊహించని విధంగా ఫ్లాప్ రావడంతో ఈయన అప్పుల పాలైపోయారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus