ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ మూడు నెలల వ్యవధిలోనే 25 మందికి పైగా సినీ సెలబ్రిటీలు మరణించడం ఆందోళన కలిగించే అంశం. మరో పక్క సినీ పరిశ్రమకి చెందిన వారి కుటుంబ సభ్యులు కూడా మరణించారు. వారితో కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెద్దది అని చెప్పొచ్చు. ఈ మధ్యనే సీనియర్ స్టార్ హీరో, ప్రభాస్ కు పెదనాన్న అయిన కృష్ణంరాజు మరణించడం,
అటు తర్వాత మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడం కూడా ఇండస్ట్రీని కుదిపేసింది అని చెప్పాలి. ఈ షాక్ ల నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే వేరే భాషలకు చెందిన నటీనటులు మరణించడం కూడా విషాదకరం అని చెప్పాలి. తాజాగా ఓ సింగర్ మరణించాడు. మరింత బాధాకరమైన విషయం ఏంటి అంటే..పాట పాడుతూ ఉండగా సింగర్ మృతి చెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..ఒడియా సింగర్ మురళీ మోహ పాత్ర స్టేజి పై పాట పాడుతూనే ప్రాణాలు విడిచాడు.
ఒడిశా కోరాపుట్ జిల్లాలో దుర్గా పూజ లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 4 పాటలు పాడిన తర్వాత కుర్చీలో కుర్చుంటున్న టైంలో ఇతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.వెంటనే సిబ్బంది మురళీ ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.గుండెపోటు కారణంగానే ఇతను మరణించినట్టు స్పష్టమవుతుంది. కొన్నాళ్లుగా ఇతని ఆరోగ్యం కూడా బాలేదని వైద్యులు చెప్పారట. ఇంతలో ఇలా జరగడం గమనార్హం.