విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటిస్తున్న ‘బెగ్గర్’ సినిమాపై హైప్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాను తెరకెక్కించడమే కాకుండా, పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతితో చేసిన డీల్ చాలా సైలెంట్‌గా జరగగా, ఈ సినిమా వివరాలపై పూరీ టీమ్ గట్టి నిబంధనలు పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా స్క్రిప్ట్ డిఫరెంట్ గానే ఉండబోతోంది కానీ, ఇప్పుడు దీనిలో మరో ఇంట్రెస్టింగ్ అంశం బయటికి వచ్చింది.
టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో ఈ సినిమాలో స్పెషల్ క్యామియో చేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పూరీ జగన్నాథ్ తనకు దగ్గరగా ఉన్న హీరోలలో ఒకరిని ఈ పాత్రకు అడగనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పూరీ సినిమాల్లో అతిథి పాత్రలు మెప్పించిన నేపథ్యంలో, ఈసారి కూడా అలాంటి ఒక సర్‌ప్రైజ్ ఉంచే అవకాశం ఉందని టాక్. ఈ క్యామియో పాత్ర తక్కువ టైం అయినా, కథలో కీలక మలుపు తిప్పేలా డిజైన్ చేయబడ్డట్టు తెలుస్తోంది.
విజయ్ సేతుపతికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘ఉప్పెన’లో (Uppena) విలన్‌గా ఆయన నటన ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఇప్పుడు తెలుగు మార్కెట్‌కి మెరుగైన కనెక్ట్ కావాలంటే, ఓ స్టార్ హీరో కనీసం చిన్న పాత్ర అయినా చేస్తే సినిమా హైప్ మరో లెవెల్‌కి వెళ్తుంది. దీనికితోడు బాలీవుడ్‌కి చెందిన టబు కూడా ఇందులో భాగం కావడంతో పాన్ ఇండియా యాంగిల్ మరింత బలపడుతోంది. ప్రస్తుతం ‘బెగ్గర్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది.
3 నెలల్లో సినిమాను పూర్తి చేసి, సంవత్సరం చివర్లో విడుదల చేయాలన్నది పూరీ టార్గెట్. పూరీకి ఇది కంబ్యాక్ ప్రాజెక్ట్ కావడంతో, స్క్రీన్‌ప్లే, క్యారెక్టర్స్‌లో ఎక్స్‌పెరిమెంట్ చేస్తారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ బోల్డ్ అటెంప్ట్ పూరీకి తిరిగి విజయాన్ని తీసుకురావడంలో ఎంత వరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.