రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకులు ఊహించిన దానికి పది రెట్లు ఎక్కువ అనుభూతి కలిగిస్తుంది. కెరీర్ బిగినింగ్ నుండి ఆయన ఒక్కసారి కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఫెయిల్ కాలేదు. ఇక బహుబలి సినిమాతో రాజమౌళి హాలీవుడ్ స్థాయి దర్శకుల జాబితాలో చేరగా తన తదుపరి చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఇందులో నటించడంతో పాటు పీరియాడిక్ సబ్జెక్టు కావడంతో రాజమౌళి అద్బుతం చేయడం ఖాయం అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.
రామ్ చరణ్ పుట్టిన రోజున విడుదలైన ఆయన ఫస్ట్ లుక్ వీడియో కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా ఈ చిత్ర తమిళ్ వర్షన్ కి డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్న మధన్ ఖార్కి ఆర్ ఆర్ ఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో పోరాట సన్నివేశాలు బాహుబలికి మించి ఉంటాయట. సినిమా ప్రారంభం నుండి అద్భుతమైన సన్నివేశాలతో ఈ చిత్రం సాగుతుందట. ఎక్కడా కూడా ప్రేక్షకుడు కథనుండి బయటకు రాలేనంతగా సినిమా ఉత్కంఠగా సాగుతుందని మధన్ ఖార్కి తెలియజేశారు.
గతంలో బాహుబలి చిత్రానికి కూడా మధన్ ఖార్కి తమిళ్ డైలాగ్ రైటర్ గా పనిచేశారు. మొత్తంగా ఆయన మాటలతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు మరో స్థాయికి చేరాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ కి సర్వం సిద్దమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ మొదలుకాలేదు. అవుట్ డోర్ షూటింగ్ కి పరిస్థితులు సహకరించిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేయించారు రాజమౌళి. ఇక ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేసిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!