సంచలన రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా “డాన్స్ రాజా డాన్స్” ట్రైలర్ రిలీజ్!

నృత్య సంచలనం ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా.. వెంకీ ఏ.ఎల్ దర్శకత్వంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం “డాన్స్ రాజా డాన్స్”గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ ను సంచలన రచయిత చిన్నికృష్ణ ఆవిష్కరించారు. నృత్య ప్రధానంగా రూపొందిన “డాన్స్ రాజా డాన్స్” తెలుగులోనూ ఘన విజయం సాధించాలని ఆయన అభిలషించారు. భారతీబాబు మాటలు-పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ ప్రముఖ సంగీత దర్శకురాలు-గాయని ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి సంచలన చిత్రాల రచయిత చిన్నికృష్ణ చేతుల మీదుగా ‘డాన్స్ రాజా డాన్స్’ ట్రైలర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందన్నారు తుమ్మలపల్లి. కార్యక్రమంలో ఈ చిత్రం ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు!!

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus