దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తెలియని వారుండరు. హిందీలో మొదలైన ఈ షో చిన్నగా అన్ని ప్రాంతీయ బాషలకు చేరింది. ఇక తెలుగులో 2017నుండి ఈ షో ప్రసారం అవుతుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా సెకండ్ సీజన్ కి నాని, మూడవ సీజన్ కి నాగార్జున ఈ షో వ్యాఖ్యతలుగా ఉన్నారు. ఇక తెలుగులో కూడా అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న ఈ షో కి ఉన్న డిమాండ్ అంత ఇంతా కాదు
బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశిస్తే ఒక్కసారిగా పాపులారి వచ్చి చేరుతుంది. విన్నర్ అయితే దాదాపు 50లక్షలకు పైగా డబ్బులు, బహమతులు దక్కుతాయి. విన్నర్ కాకపోయినా షోలో కొనసాగిన కాలాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఎవరికి మాత్రం బిగ్ హౌస్ లోకి ప్రవేశించాలని ఉండదు చెప్పండి. అందుకే ఈ షోలో పాల్గొనే అవకాశం కొరకు చాలా మంది తాపత్రయ పడతారు. కొందరైతే పైరవీలు కూడా మొదలుపెడతారు.
ఐతే ఈ సారి బిగ్ బాస్ షో పై సెలబ్రటీలలో అంత ఆసక్తి కనపడడం లేదట. దానికి కారణం కరోనా వైరస్ అని తెలుస్తుంది. అన్ని రోజులు కొందరితో కలిసి ఒక హౌస్ లో ఉండడం అంత క్షేమం కాదని వారు భావిస్తున్నారట. మరో వైపు నిర్వాహకులు అన్నీ సిద్ధం చేస్తుంటే, ఈ షో ఈ ఏడాది జరగడం అంత సులభం కాదన్న వాదన వినిపిస్తుంది.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!