సినీ సెలబ్రిటీలు పైసల గురించే కాదు… ప్రజల కోసం కూడా కష్టపడుతున్నారు. సమాజం బాగు కోసం తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అనేక విషయాలపై చైతన్యం కలిగిస్తున్నారు. మార్పుకు పునాదులు వేస్తున్నారు. వెండితెర పైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా అనిపించుకుంటున్న కొంతమంది స్టార్ల గురించి “ఫిల్మీ ఫోకస్” స్పెషల్ ఫోకస్..
రక్తదానం గొప్పదనం
మెగాస్టార్ చిరంజీవి అనేక సేవా కార్యకమాల్లో పాల్గొన్నారు. ఆయన సొంతంగా 1998 లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తదానం పై విస్తృత ప్రచారం నిర్వహించారు. అభిమానులు బాగా స్పందించి రక్తాన్ని దానం చేసారు. అలాగే నేత్రదానం పై కూడా చైతన్యం కలిగించారు. తన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో అంధ చిన్నారితో నేత్రదానం ఆవశ్యకత గురించి వివరించేలా చేసారు. తెలుగు ప్రజల్లో రక్తదానం, నేత్రదానంపై అవగాహన ఏర్పడేందుకు ప్రముఖ పాత్ర వహించారు.
చిన్నారుల సేవలో..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఊరిని దత్తత తీసుకుని నిజ జీవితంలోనూ శ్రీమంతుడుగా నిరూపించుకున్నాడు. అంతే కాదు.. అరుదుగా వచ్చే వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం పనిచేస్తున్న సంస్థ “హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్” కు మహేష్ వెన్నుగా నిలిచాడు. సంస్థకు నిధులను సేకరించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ప్రిన్స్ వల్ల ఫౌండేషన్ కు మరింతమంది పిల్లలకు సేవ చేసే శక్తి లభించింది.
అవయవ దానం పై..
కింగ్ నాగార్జున అవయవ దానం పత్రాలపై సంతకం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రమాద వశాత్తు ప్రాణాలను కోల్పోతే మరొకరికి ప్రాణదానం చేసే అవకాశాన్ని వదులుకోవద్దని నాగ్ చెప్పిన మాటలకు ఆయన అభిమానులు స్పందించారు. మన్మథుడి పిలుపు మేరకు ఇప్పటి వరకు 4600 మంది అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
అనుష్క
టాలీవుడ్ అరుంధతి అనుష్క కూడా ఎయిడ్స్ పై అవగాహన కల్పించే వీడియోలకు గొంతును అరువు ఇస్తోంది.
https://www.youtube.com/watch?v=TNzxMo9XGIg
“షి” టీంకు కూడా ప్రచార కర్తగా..
మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలను అయన కుమారుడు రామ్ చరణ్ కొనసాగిస్తున్నాడు. రక్తదానం పై మరింత అవగాహన కలిగించాలని ప్రత్యేక యాప్ ని విడుదల చేసాడు. ఆ యాప్ ని ఎక్కువ మంది అభిమానులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్ లోదే చేసుకున్నారు. రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన “షి” టీంకు కూడా ప్రచార కర్తగా ఉన్నాడు.
అందమైన మనసు..
అందంతో యుతను ఆకట్టుకున్న బబ్లీ బ్యూటీ సమంత మనసు కూడా అందమైనదని నిరూపించుకుంది. అనారోగ్యంతో భాదపడుతున్న పేద పిల్లలకు తన ఖర్చుతో వైద్యం చేయిస్తోంది. చిన్నారుల కోసం సేవలందించే ఎన్జీఓ తో చేతులు కలిపి మురికి వాడల్లోని బాలలకు ఉచితంగా మందులను అందిస్తోంది.
https://www.youtube.com/watch?v=nUC3T_JMTik
ఎయిడ్స్ పై అవగాహన ..
సురక్షిత శృంగారం అనే అంశం పై లవర్ బాయ్ సిద్ధార్ద్ అవగాహన కల్పిస్తున్నాడు. ఆవేశంగా శృంగారంలో పాల్గొని వ్యాధులను తెచ్చుకోవద్దని చూసిస్తున్నాడు. కండోమ్ ను తప్పకుండా వాడమని చెబుతున్నాడు. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న “నాకో” వారికి చేయూతనిస్తున్నాడు. ఎయిడ్స్ ను తరిమేందుకు వారు రూపొందించే ప్రచార వీడియోలలో నటిస్తున్నాడు. ఎయిడ్స్ అవగాహన యానిమేటెడ్ పాత్రలకు వాయిస్ అందిస్తూ తన వంతు సహాయం చేస్తున్నాడు.
పాటల ద్వారా ..
విస్వనటుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ నటి కాక ముందు మంచి సింగర్. ఆమెకు యువతలో ఎక్కువ మంది అభిమానులున్నారు. వారిని ఎయిడ్స్ మహమ్మారి నుంచి రక్షించేందుకు శ్రుతి పాటుపడుతోంది. తన పాటల ద్వారా అవగాహన కల్పిస్తోంది.
తండ్రి అడుగుజాడల్లో ..
నందమూరి తారక రామారావు పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. పేదల దేవుడిగా పేరొందారు. ఆయన కొడుకుగా నట వారసత్వం అందుకున్నబాలకృష్ణ సేవా కార్యక్రమాల్లోను తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకున్నారు. క్యాన్సర్ బారిన పడిన పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్” సేవలను బాలకృష్ణ విస్తృత పరిచారు. చికిత్స చేసుకున్న వారికి ఉచితంగా భోజన వసతి కల్పించారు. అంతే కాకుండా .. జన్యుపరంగా వచ్చే క్లెఫ్ట్ (గ్రహణం మొర్రి, పెదవి చీలిక) జబ్బుతో బాధపడే చిన్నారులకు బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్(బీఎస్‌టీసీ) ద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నారు.