Narsimha Movie: నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ రమ్యకృష్ణ కాదట.. ఎవరంటే..!

  • May 24, 2022 / 11:28 AM IST

‘నరసింహ’.. రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఒకటి. కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 1999 వ సంవత్సరంలో ఏప్రిల్ 10న తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదలైన ఈ చిత్రం రెండు చోట్ల కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో ‘నా దారి రహదారి’ అనే డైలాగ్ అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇక ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ల గురించి. సౌందర్య, రమ్యకృష్ణ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

సౌందర్య అమాయకురాలు పాత్రలో నరసింహ (రజినీకాంత్) భార్యగా కనిపిస్తే, రమ్యకృష్ణ మాత్రం నరసింహని ప్రేమించే అమ్మాయిగా.. తర్వాత అతను కాదనడంతో.. అతని పై అలాగే అతని కుటుంబం పై పగ తీర్చుకునే లేడీ విలన్ గా మారుతుంది. ఈ చిత్రంలో నీలాంబరి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఈమె పాత్ర లేకపోతే సినిమానే లేదు అని చెప్పాలి. అయితే ఈ పాత్రకి ముందుగా నగ్మా, మీనా లని అనుకున్నాడట దర్శకుడు. అయితే నగ్మా డేట్స్ బిజీగా ఉండగా…

మీనాలో విలన్ షేడ్స్ కనిపించడం లేదట. తర్వాత రమ్యకృష్ణని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ‘నరసింహ’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అందులో రమ్యకృష్ణ కాళ్ళు పడుతుంటుంది సౌందర్య. అప్పుడు సౌందర్యని మొహాన్ని కాలుతో తన వైపుకి తిప్పుకుంటుంది రమ్యకృష్ణ. ఈ సీన్ చేసేప్పుడు రమ్యకృష్ణ చాలా ఎమోషనల్ అయ్యిందట. ‘తన కంటే సౌందర్య పెద్ద స్టార్ హీరోయిన్ అని..

ఆమెని అలా చేస్తే అభిమానులు, ప్రేక్షకులు తనని తిట్టుకుంటారని ఏడ్చేసిందట. అయితే సౌందర్యనే రమ్య కాలుని మొహం పై పెట్టుకుందట. అప్పుడు రమ్య నటించిందని దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక సినిమా విడుదలయ్యాక రమ్యకృష్ణ పాత్రకి మంచి అప్లాజ్ వచ్చింది. ఆమెని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతలా నీలాంబరి పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus