ఒక్కడు సినిమాకి సీక్వెల్ కథ సిద్ధం
- April 22, 2017 / 01:57 PM ISTByFilmy Focus
మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేశారు. ధరిణి (బంగారం ఫేమ్) విజయ్, త్రిష లను హీరోహీరోయిన్లుగా పెట్టి ఒక్కడిని రీమేక్ చేశారు. తెలుగులో మాదిరి తమిళంలోనూ ఈ కథ సూపర్ హిట్ అయింది. దీంతో ధరిణి ఒక్కడు సినిమాకి సీక్వెల్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కథని కూడా సిద్ధం చేశారు. విజయ్ కి ఖాళీ దొరకగానే స్టోరీని వినిపించాలని అనుకుంటున్నారు. తమిళంలో సీక్వెల్ వస్తుంటే.. తెలుగులో పరిస్థితి ఏంటి ?
ఈ సీక్వెల్ కథతో మహేష్ సినిమా చేస్తారా? అందుకు గుణ శేఖర్ డైరక్ట్ చేస్తారా? లేకుంటే ధరిణి డైరక్షన్ లోనే ప్రిన్స్ నటిస్తారా? ఇలా అనేక ప్రశ్నలను ఈ సీక్వెల్ కథ రేకెత్తిస్తోంది. మహేష్ స్పైడర్ మూవీ ద్వారా తమిళంలో మహేష్ అడుగుపెడుతున్నారు. ఇక ఒక్కడు సినిమా సీక్వెల్ ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి మహేష్ ఏమంటారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















