అల్లు అర్జున్ వెండితెరపై ఎలా కనిపిస్తాడో పర్సనల్ లైఫ్ లో కూడా అంతే స్టైలిష్ గా ఉండడానికి ఇష్టపడతాడు. ఇక అతను ఈ లగ్జరీ లైఫ్ వెనుక ఎంతో కష్టం కూడా ఉంది. టాలీవుడ్ లోనే కాకుండా ఆల్ మోస్ట్ ఇండియా మొత్తంలో డ్యాన్స్ తో ఇరగదీసే బెస్ట్ హీరోల్లో బన్నీ ఒకడు. స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్న తరువాతే తనకు నచ్చినట్లుగా లైఫ్ ను సొంత సంపాదనతోనే సెట్ చేసుకున్నాడు. ఇక బన్నీ కొనే కార్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాడు.
ఖరీదైన కారావాన్ కలిగిన అల్లు అర్జున్ దానికి ఫాల్కన్ అని పేరు పెట్టుకున్నాడు. దాదాపు 7కోట్ల విలువ కలిగిన ఆ కారావాన్ కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇక కార్ల విషయానికి వస్తే బన్నీ గ్యారేజ్ లో మొత్తంగా కారావాన్ తో కలుపుకొని 12కోట్ల విలువైన కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సి 90 టి8 ఎక్సలెన్స్ కారు ధర 1.31కోట్లు. ఇక 75లక్షల విలువగల హమ్మర్ H2 కారు కూడా ఉంది. అలాగే కోటికి పైగా విలువ కలిగిన జాగ్వార్ XJL కూడా ఉంది.
ఇక రేంజ్ రోవర్ రోగ్ కారును కూడా బన్నీ 2019లో కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 2.11కోట్లు. ఇలా మొత్తంగా బన్నీ కార్ల కోసమే 12కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఇక బన్నీ ఇంట్లో ప్రతిదీ కూడా ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఓ సందర్భంలో అల్లు అరవింద్ బన్నీ కాస్ట్లీ లైఫ్ పై సరదాగా కామెంట్ కూడా చేశాడు. బన్నీ స్విమ్మింగ్ పూల్ కోసమే ఊహకందని రేంజ్ లో ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. అల్లు అరవింద్ కు వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ బన్నీ తండ్రి నుంచి ఆశించకుండానే తన లగ్జరీ లైఫ్ ను మెయింటైన్ చేస్తున్నాడు.