Sudheer Babu: కృష్ణ గారిని తలుచుకొని వేదికపైనే బోరున ఏడ్చిన సుధీర్ బాబు!

టాలీవుడ్ హీరో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నవంబర్ 15 న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మరణించి నేటికి 12 రోజులు కావస్తోంది. అయితే ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాదులోని జేఆర్సి ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించారు.

కృష్ణ పెద్దకర్మ కార్యక్రమానికి పెట్టమనేని ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు ఘట్టమనేని అభిమానులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. కాగా ఆ కార్యక్రమానికి 5వేల మందికి పైగా అభిమానులు హాజరైనట్టు తెలుస్తోంది. అలాగే ఆ కార్యక్రమానికి అభిమానుల కోసం పాసులు పంపిణీ చేయడంతో పాటు 32 రకాల వంటలతో విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని కూడా ప్రదర్శించనున్నారు.

ఇప్పటికే మహేశ్‌ బాబు అలాగే ఘట్టమనేని ఫ్యామిలి అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ కృష్ణ గురించి అల్లుడు సుధీర్‌ బాబు మాట్లాడుతూ స్టేజి పైన ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటాను అంటూ ఎమోషనల్‌ అయ్యారు. సుధీర్ బాబుతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ కూడా కృష్ణ మరణవార్తను జీర్ణించుకోలేక కంటతడి పెట్టారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతూ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడం మాత్రమే కాకుండా స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus