సుధీర్ బాబు(Sudhir Babu) లేటెస్ట్ మూవీ ‘జటాధర'(Jatadhara) నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు స్పీచ్ ఇస్తూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఈరోజు మొత్తం నిజాలే మాట్లాడతా..! అంటే ఇప్పటివరకు అబద్దాలే మాట్లాడాను అని కాదు.. నిజాలు మాట్లాడలేదు అంతే.! ఇప్పటి వరకు సుధీర్ బాబు ఎవరు అంటే ఎక్కువ మంది సూపర్ కృష్ణగారి అల్లుడు, మహేష్ బాబు బావ అనే చెబుతున్నారు. అది అబద్దం అనడానికి లేదు. అలా చెప్పుకోవడానికి నేను కూడా గర్వపడతాను. అంత ప్రేమ నాకు కూడా ఉంది.

కానీ నేను కూడా అందరి హీరోల్లానే ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి వెళ్లాను. నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చేవారు. తర్వాత నో చెప్పేవారు. నాకు కృష్ణగారు, మహేష్ బాబు వల్ల దొరికింది ఆ ఎక్స్ట్రా కాఫీ మాత్రమే.అంతకు మించి అడ్వాంటేజ్ నేను తీసుకోదలుచుకోలేదు. చాలా మందికి అది కూడా దొరక్కపోవచ్చు.నాకు ఓ పెద్ద బ్యానర్లో ఛాన్స్ ఇప్పించమని, పెద్ద డైరెక్టర్ కి రిఫర్ చేయమని.. మహేష్..ను నేను అడగలేదు.

కానీ మహేష్ మాత్రం నాకు హెల్ప్ చేసేందుకు ఎప్పుడూ రెడీనే..! నా ఒక్క మాట కోసం ఎదురుచూస్తున్నాడు. కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలీకపోవచ్చు కానీ..కళ్ళ ముందు తిండి ఉంది నిరాశతో ముద్ద దిగిపోవడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవకాశాల కోసం నేను బస్సులో తిరిగుండకపోవచ్చు… కానీ కార్లో కూర్చుని ఏడవడం ఏంటో నాకు తెలుసు.
ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పడం లేదు. అలా చెప్పాలనుకుంటే నా మొదటి సినిమా టైంలోనే చెప్పేవాడిని. ఇంతదూరం వచ్చాక సింపతీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నా సినిమా ఈవెంట్లకి 10 మంది వస్తే.. అందులో 9 మంది మహేష్ కోసమే వస్తారు. నాకోసం ఒక్కడే వస్తాడు. ఆ ఒక్కడిని మల్టిప్లై చేసుకోవాలనేదే నా ప్రయత్నం. నేను చేసిన 20 సినిమాల్లో హిట్టుకి కారణం నా కష్టం.. నా ప్లాప్ కి కారణం కూడా నేనే” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
