టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఒక్కో సినిమా చేయడానికి సుకుమార్ చాలా సమయం తీసుకుంటారు. తన క్రియేటివిటీతో ఆడియన్స్ ను మెప్పిస్తుంటారు. అయితే సుకుమార్ తన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, విలన్స్ ను రిపీట్ చేయడానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కాంబినేషన్స్ ను తెరపై చూపించాలనుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక విలన్ క్యారెక్టర్ ను అలా రిపీట్ చేస్తూనే ఉన్నారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జగపతిబాబుని విలన్ గా తీసుకున్నారు సుకుమార్.
స్టైలిష్ విలన్ క్యారెక్టర్ లో జగపతి బాగా పెర్ఫార్మ్ చేశారు. దాని తరువాత రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో కూడా జగపతి బాబునే విలన్ గా తీసుకున్నారు సుకుమార్. ఆ సినిమాలో జగపతిబాబు మేకోవర్ చూసి జనాలు షాక్ అయ్యారు. ఆ రేంజ్ లో జగ్గూభాయ్ ని తెరపై ప్రెజంట్ చేశారు. అయితే ‘పుష్ప’ సినిమాకి వచ్చేసరికి సుకుమార్ రూటు మార్చినట్లు కనిపించారు. ఫస్ట్ పార్టీ లో సునీల్ ని దాదాపు మెయిన్ విలన్ గా చూపించారు.
ఆ తరువాత చివరిలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ని ప్రవేశపెట్టి దాన్ని సెకండ్ పార్ట్ కు మెయిన్ విలన్ గా మారుస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆ విధంగానే ‘పుష్ప’ పార్ట్ 2లో బన్నీతో పోరాటం చేయబోతున్నారు ఫహద్ ఫాజిల్. అయితే ఇందులో మరో విలన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం జగపతిబాబుని తీసుకున్నారట. ఫహద్ ఫాజిల్ కి అండగా నిలుస్తూ.. పుష్పని అంతం చేయాలనుకునే రాజకీయనాయకుడు పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు.
అంటే వరుసగా మూడు సినిమాల్లో సుకుమార్ జగపతి బాబుని విలన్ గా కొనసాగిస్తున్నారన్నమాట. సుకుమార్ లాంటి దర్శకుడిని మెప్పించి అతడి సినిమాల్లో వరుసగా అవకాశాలు కొట్టేస్తున్నారు జగపతి బాబు. ఇక ‘పుష్ప2’ లో జగపతి బాబు లుక్, మేనరిజమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయట. ఇప్పటికే ‘పుష్ప2’ షూటింగ్ మొదలైంది. త్వరలోనే సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీనికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.