Sukumar: సుకుమార్‌ ప్లాన్స్‌ అదిరిపోతున్నాయ్‌.. ఎప్పుడో స్టార్ట్‌

పాన్‌ ఇండియా సినిమా అంటే రాజమౌళినే చేయాలి అనుకుంటున్న రోజుల్లో ‘పుష్ప’ సినిమాను తీసుకొచ్చి ‘నేనూ రెడీ’ అని చెప్పకనే చెప్పారు సుకుమార్‌. అల్లు అర్జున్‌ను ‘పుష్ప’గా చూపించిన తీరు ప్రేక్షకులకు నచ్చి… ఇప్పటికీ ఏదో ఒక చోట పుష్ప మేనరిజమ్స్‌ ఇమిటేట్‌ చేస్తూనే ఉన్నారు. అంతలా పుష్ప క్యారెక్టర్‌ను జనాల్లోకి ఎక్కించేశారు సుకుమార్‌. ఇప్పుడు ‘పుష్ప’రాజ్‌ సెకండ్‌ పార్ట్‌ విషయంలో డబుల్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకే షూటింగ్‌ ప్రారంభం ఆలస్యం అని తెలుస్తోంది.

గతేడాది డిసెంబరు ఆఖరులో ‘పుష్ప ది రైజ్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీసు దగ్గర సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి దాటాక కూడా వసూళ్ల రీసౌండ్‌ వినిపిస్తూ ఉండింది. ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో పార్టు షూటింగ్‌ ప్రారంభిస్తారు అని అందరూ అనుకున్నారు. టీమ్‌ కూడా అలాంటి హింట్సే ఇచ్చింది. కానీ మే వచ్చేసినా ఇంకా షూటింగ్‌ మొదలవ్వలేదు. ఏమైందా అని ఆరా తీస్తే కథలో కొత్త పాత్రలు ఎంటర్‌ చేస్తున్నారట. దీని వల్ల సినిమా డబుల్‌ స్పెషల్‌ అవుతుంది అని చెబుతున్నారు.

‘పుష్ప’ లాంటి కమర్షియల్‌ సినిమాకు రెండో పార్టు అంటే అంతకుమించి ఉండాలి. దానికి తోడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ 2’ లాంటి సినిమాలు వచ్చి వెళ్లాయి. అందులో ఉన్న ఎలివేషన్లకు మించి ఇందులో రాసుకోవాలి సుకుమార్‌ టీమ్‌. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. దీంతోపాటు అందం కూడా డబుల్‌ చేస్తున్నారట. అదేనండీ మరో హీరోయిన్‌ని సినిమాలోకి ఎంట్రీ ఇస్తారట. కుర్ర హీరోయిన్‌ను తీసుకొన్ని ‘పుష్ప’రాజ్‌తో కొత్త రొమాంటిక్‌ ట్రాక్‌ నడిపే ప్రయత్నం చేస్తారట.

అంతా ఓకే అనుకుంటే త్వరలోనే ఆ రెండో హీరోయిన్‌ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పటికే శ్రీవల్లి (రష్మిక)తో పెళ్లి అయిపోవడంతో.. రొమాంటిక్‌ ట్రాక్‌ పెట్టే అవకాశం లేదు. అందుకే కొత్త ట్రాక్‌ అని సమాచారం. అలాగే స్పెషల్‌ సాంగ్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌ను తీసుకు రావడం పక్కా. తొలి పార్ట్‌లో సమంత వచ్చి వెళ్లింది. మరి ఈ పార్ట్‌లో ఎవరు వస్తారో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus