మెగా హీరో నిశ్చితార్థంలో సుమ, రాజీవ్ సందడి.. ఫోటోలు వైరల్!

కొణిదెల కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో చాలామంది సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల ఇప్పటికే హీరోగా నటించినా సినిమాల ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటంతో పవన్ తేజ్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో ఊహించని రేంజ్ కు ఎదుగుతారని అభిమానులు భావిస్తారు. తాజాగా పవన్ తేజ్ కొణిదెల నిశ్చితార్థం వేడుక గ్రాండ్ గా జరిగింది.

యాంకర్, హీరోయిన్ అయిన మేఘన అనే యువతిని పవన్ తేజ్ వివాహం చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ వేడుకకు చిరంజీవి భార్య కొణిదెల సురేఖతో పాటు యాంకర్ సుమ, రాజీవ్ కనకాల మరి కొందరు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సుమ, రాజీవ్ హాజరు కావడంతో వేడుక జరిగే చోట మరింత సందడి నెలకొంది. మేఘన సొంతూరు కాకినాడ కాగా ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాలో పవన్ తేజ్, మేఘన కలిసి నటించడం గమనార్హం.

ఈ కథలో పాత్రలు కల్పితం ఫ్లాప్ అయినా ఆ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయమే వీళ్లిద్దరి పెళ్లికి దారి తీసిందని సమాచారం. ప్రేమించి పెద్దలను ఒప్పించి పవన్ తేజ్, మేఘన వివాహం చేసుకుంటున్నారు. పవన్ తేజ్ మేఘన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేఘన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఈ ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం గమనార్హం. పవన్ తేజ్ మేఘన జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ తేజ్ కు చిరంజీవి వరుసకు బాబాయ్ అవుతారు. పెళ్లి తర్వాత మేఘన యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus