Suma: షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన సుమ..!

టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేరు సుమ. ఏ సినిమా వేడుక జరిగినా సుమ ఉండాలి. ఆమె ఉంటేనే ఆ వేడుకకు అందం. సుమ హోస్ట్ చేయడం లేదు అంటే ఆ వేడుకలు చూడడం కూడా మానేస్తుంటారు కొంత మంది ప్రేక్షకులు అనడంలో అతిశయోక్తి లేదు.ఇక బుల్లితెర పై సుమ హంగామా గురించి చెప్పనవసరం లేదు. బుల్లితెర పై ఆమె హోస్ట్ చేసిన షోలతో ప్రతి ఫ్యామిలీ లో ఓ మెంబర్ గా మారిపోయింది సుమ.

సోషల్ మీడియాలో కూడా సుమ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..! ఆమె గురించి ఏ వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. మొన్నామధ్య సుమ తన భర్త రాజీవ్ కనకాల తో విడాకులు తీసుకోబోతుంది అంటూ వచ్చిన వార్తలు ఏ రేంజ్ లో హల్ చల్ చేశాయి అన్న సంగతి తెలిసిందే. అయితే భార్యా భర్తలు అన్న తర్వాత ఏదో ఒకటి అనుకోవడం, గొడవ పడడం మాములు విషయమే అని సుమ ఆ వార్తలను కొట్టి పారేసింది.

ఇక ఈ మధ్యనే ఆమె ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా సుమ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఈ విషయాన్ని స్వయంగా సుమ తెలియజేయడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ.. ” నేను కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధ పడుతున్నాను. ఈ చర్మ వ్యాధి కారణంగా కొన్ని సంవత్సరాలు ఎన్నో భాదలు, క‌ష్టాలు పడ్డాను.

ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.నా కెరీర్ ప్రారంభంలో ముఖానికి మేక‌ప్ ఎలా వేసుకోవాలి, ఎలా తీసేయాలి అనే విషయాలు నాకు సరిగ్గా తెలీదు. దీంతో చాలా బాధలు పడ్డాను. తర్వాత అది తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోయింది” అంటూ చెప్పుకొచ్చింది సుమ. కీలాయిడ్ టెండెన్సీ అంటే చర్మం పై ఏదైనా గాయం అయితే.. అది ఇంకా పెరిగిపోయి బాధపెడుతుంది. తర్వాత ఆ గాయం పోయినా దాని ఆనవాళ్లు తొందరగా పోవు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus