Suman: వైరల్ అవుతున్న సుమన్ సంచలన వ్యాఖ్యలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచనాలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆయన అభిమానులలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. పవన్ ప్రస్తుతం వినోదాయ సిత్తం రీమేక్ లో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే తాజాగా సుమన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంటాడని సుమన్ అన్నారు.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నానని పవన్ కు మంచి క్రేజ్ ఉందని ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్లినా పవన్ కు ఫ్యాన్స్ ఉన్నారని ఈ విషయంలో ఆయన లక్కీ అని సుమన్  చెప్పుకొచ్చారు. పాలిటిక్స్ అయినా బిజినెస్ అయినా రాసిపెట్టి ఉండాలని ఆయన తెలిపారు. మనం అంతా యాక్టర్లమే అని సుమన్ తెలిపారు. దేవుడు మనకు కొన్ని పనులను అప్పగిస్తాడని మీరు చేసే పనులను నేను చేయలేనని సుమన్ చెప్పుకొచ్చారు.

పవన్ సీఎం కావాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడని ఆయన పేర్కొన్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఐదుసార్లు సీఎం అయ్యారని సుమన్ కామెంట్లు చేశారు. పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని సుమన్ చెప్పుకొచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్ సెట్ కావాలని సుమన్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ధైర్యంగా ఉంటామని ప్రజలు ఎప్పుడు అనుకుంటారో అప్పుడే ఆయన సీఎం అవుతారని సుమన్ పేర్కొన్నారు.

ఒక నటుడిగా పవన్ కళ్యాణ్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని సుమన్ (Suman) చెప్పుకొచ్చారు. పవన్ ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నానని సుమన్ వెల్లడించారు. సుమన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పవన్ పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus