Suman: ఏపీ టికెట్ రేట్లపై సుమన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

ఏపీలో దాదాపుగా 11 నెలల క్రితం సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. అయితే తగ్గించిన టికెట్ రేట్ల వల్ల ఏపీలో పెద్ద సినిమాలకు భారీస్థాయిలో నష్టాలు వస్తున్నాయి. చిరంజీవి పలువురు సినీ ప్రముఖులతో కలిసి సీఎం జగన్ తో టాలీవుడ్ సమస్యల గురించి చర్చించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మీటింగ్ కు ఆహ్వానం అందినా కొంతమంది స్టార్ హీరోలు హాజరు కాలేదు. అయితే మరోవైపు మరి కొందరు హీరోలు మాత్రం ఈ మీటింగ్ కు తమకు కనీసం ఆహ్వానం అందలేదని చెబుతుండటం గమనార్హం.

టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో 44 సంవత్సరాల నుంచి ఉన్నానని సీఎం జగన్ తో మీటింగ్ కు తనను పిలిస్తే కచ్చితంగా వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. బయ్యర్ల గురించే తన ఆవేదన అని ఆయన కామెంట్లు చేశారు. బయ్యర్లు నీచమైన స్థితిలో చనిపోవడం తాను గమనించానని బయ్యర్లు లేకపోతే సినిమా జాడే ఉండదని ఆయన తెలిపారు. బయ్యర్లను కాపాడుకోలేకపోతే సినిమా ఉనికే ఉండదని సుమన్ పేర్కొన్నారు.

సినిమా కొన్న తర్వాత బయ్యర్లను ఎవరూ పట్టించుకోవడం లేదని సుమన్ కామెంట్లు చేశారు. బయ్యర్లు లేకపోతే నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుందని సుమన్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ దగ్గరకు వెళితే తాను ఈ విషయం గురించి మాట్లాడేవాడినని సుమన్ పేర్కొన్నారు. సినిమావాళ్లు బయ్యర్లు నష్టపోతే ఆదుకుంటే బాగుంటుందని సుమన్ అన్నారు. సినిమా రంగంలో అందరూ బాగున్నారని అందరూ అనుకుంటున్నారని అది నిజం కాదని సుమన్ కామెంట్లు చేశారు.

తన దృష్టిలో బయ్యర్ బాగుంటే మాత్రమే అందరూ బాగుంటారని సుమన్ వెల్లడించారు. సుమన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు కొత్త టికెట్ల జీవో ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. త్వరలో ఆ జీవో అమలులోకి వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus