సుమంత్ (Sumanth) ఇటీవల ‘అనగనగా’ (Anaganaga) అనే ఓటీటీ సినిమాతో ఓ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది. రోజు రోజుకీ దీని రీచ్ పెరుగుతూనే ఉంది. సుమంత్ కూడా యాక్టివ్ గా దీన్ని ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూలు అవి ఇస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని ఓ సూపర్ హిట్ సినిమా బాధపెడుతూనే ఉన్నట్టు చెప్పి షాకిచ్చాడు. సుమంత్ మాట్లాడుతూ.. ” ‘నువ్వేకావాలి’ సినిమా ఛాన్స్ ఫస్ట్ నాకే వచ్చింది. కథ విన్నాను.
నాకు నచ్చింది. కానీ ఎందుకో నేను చేయలేకపోయాను. తర్వాత అది పెద్ద హిట్ అయ్యింది. రిజల్ట్ ఎలా ఉన్నా.. మంచి కథ మిస్ చేసుకున్నాను అని చాలా సార్లు రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. తరుణ్ (Tarun Kumar), రిచా జంటగా నటించిన ‘నువ్వే కావాలి’ సినిమా 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar )ఈ చిత్రానికి దర్శకుడు. త్రివిక్రమ్ (Trivikram) రైటర్ గా పనిచేశారు.
కోటి (Saluri Koteswara Rao) సంగీతంలో రూపొందిన పాటలు కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటలు కీలక పాత్ర పోషించాయి అని చెప్పాలి. తరుణ్ కి ఇది డెబ్యూ మూవీ. ఆ టైంలో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రూ.20 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఇలాంటి సినిమాని మిస్ చేసుకున్నప్పుడు ఆ మాత్రం బాధగానే ఉంటుంది. కానీ సుమంత్ కనుక ఈ సినిమా చేసి ఉంటే.. కచ్చితంగా అతని రేంజ్ ఇప్పుడు వేరేలా ఉండేదేమో.