అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా చేస్తాను అంటే.. అందులోనూ ‘పుష్ప’ (Pushpa) సినిమాల తర్వాత చేస్తాను అంటే ఏ నిర్మాత ముందుకురారు చెప్పండి. వాళ్ల ఇంట్లోనే ఓ పెద్ద బ్యానర్ కూడా ఉంది. స్నేహితుల బ్యానర్లు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వేరే ఇండస్ట్రీ నుండి ఓ నిర్మాత వచ్చి సినిమా చేస్తున్నారు అంటే.. కచ్చితంగా ఆ నిర్మాణ సంస్థ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అర్థం. అలాంటి ఆలోచనలు ఇప్పుడున్న నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) అని చెప్పొచ్చు.
ఇప్పటికే ఓ తెలుగు సినిమా అనౌన్స్ చేసిన సన్ టీమ్ (Sun Pictures) .. మరో సినిమా ప్లాన్‌లో ఉంది అని చెబుతున్నారు. అల్లు అర్జున్ – అట్లీ (Atlee Kumar) కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గత కొన్నేళ్లుగా తమిళనాడులో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ.. తొలిసారి బౌండరీలు దాటి తెలుగు సినిమా వరకు వచ్చింది.
అయితే ఇదేదో అట్లీ కోసం మాత్రమే సినిమా చేయడం కాదు.. తెలుగులోకి పూర్తి స్థాయిలో రావాలి అనుకునే ఆ సినిమాను ఓకే చేశారట. రెండో సినిమాను కూడా స్టార్ హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యారట. అయితే మరి ఆ సినిమా తమిళ దర్శకుడు హ్యాండిల్ చేస్తారా? లేక తెలుగు దర్శకుడా అనేది చూడాలి. ఇక అల్లు అర్జున్ – అట్లీ సినిమా విషయానికొస్తే.. ‘రాజా రాణి’ (Raja Rani) లాంటి ప్రేమకథతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ..
ఆ తర్వాత విజయ్‌తో (Vijay Thalapathy) ‘తెరి’ (Theri), ‘మెర్సల్’ (Mersal), ‘బిగిల్’ (Bigil) లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఓ సూపర్ హీరో తరహా సినిమా ఒకటి చేస్తారు అని వార్తలొచ్చాయి. దాని కోసం చర్చలు కూడా సాగాయి. కానీ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. ఇప్పుడు ఆ కథనే అల్లు అర్జున్‌తో తన స్థాయిలో సిద్ధం చేసి ఇచ్చారు అని అంటున్నారు.