విజయం వచ్చినప్పుడే కష్టాన్ని గుర్తిస్తున్నారు : సందీప్ కిషన్

ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సందీప్ కిషన్. సందీప్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించారు. హాకీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా తన కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా కథ, కథనంలో కీలక మార్పులు చేశామని సందీప్ అన్నారు.

తన సినీ కెరీర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన తొలి సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ అని సందీప్ కిషన్ తెలిపారు. ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి తగిన విలువ దక్కడం లేదని.. సక్సెస్ వచ్చిన సమయంలో తప్ప మిగిలిన సందర్భాల్లో ఆ కష్టాన్ని పట్టించుకోవడం లేదని సందీప్ కిషన్ అన్నారు. ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గానని.. హాకీ లైవ్ మ్యాచులు చూసి హాకీ ఆడేవాళ్ల హావభావాలను తెలుసుకున్నానని సందీప్ తెలిపారు.

మొహాలి స్టేడియంలో ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరిగిందని.. హాకీ ఆడే సమయంలో చేతులకు చాలా దెబ్బలు తగిలాయని సందీప్ అన్నారు. ఈ సినిమాలో 8 మంది నిజమైన హాకీ ఆటగాళ్లు ఆడారని.. వాళ్లు ఒక్కరోజుకు కేవలం 5వేల రూపాయల చొప్పున తీసుకున్నారని సందీప్ చెప్పారు. హాకీ క్రీడాకారులు అంత తక్కువ మొత్తం తీసుకున్నారని తెలిసి తాను షాకయ్యానని.. అంత తక్కువ మొత్తం తీసుకుంటున్నారంటే వాళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని సందీప్ తెలిపారు. ప్రస్తుతం రౌడీ బేబీ అనే సినిమాలో, వివాహ భోజనంబు అనే సినిమాలో గెస్ట్ రోల్ లో తాను నటిస్తున్నానని సందీప్ కిషన్ చెప్పారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus