టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ కు (Sundeep Kishan) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోకపోవడం వల్ల సందీప్ కిషన్ ఒకానొక సమయంలో వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బందులు పడ్డారు. అయితే ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) హిట్ తో సందీప్ కిషన్ దశ మారింది. థియేటర్లలో ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకుంది. కథ, కథనం కొత్తగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.
సందీప్ కిషన్ తర్వాత సినిమాను సైతం అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మించనుండగా ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. దాదాపుగా 25 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. భారీ సబ్జెక్ట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సీజీ, విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్ కిషన్ సైతం కథ, కథనంపై దృష్టి పెడుతూ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సందీప్ కిషన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.
చాలామంది హీరోలతో పోల్చి చూస్తే తక్కువ పారితోషికం తీసుకుంటూ ఉండటం ఈ నటుడికి మరింత ప్లస్ అవుతోంది. సందీప్ కిషన్ కు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తైందని సమాచారం అందుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.