కృష్ణగారి ఇల్లు.. అక్కడికి మాత్రం నో ఎంట్రీ!

సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. అయన గురించి తెలిసిన వారు వ్యక్తిగతంగా కూడా ఆయన్ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో తన ఫ్యామిలీతో కలిసి జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కృష్ణ హోమ్ టూర్ వీడియో చేశారు ఆయన కూతురు మంజుల ఘట్టమనేని. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో రిలీజ్ చేశారు. ఎంతో రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎవరూ ఊహించని రీతిలో కృష్ణ ఇల్లు నిర్మించుకున్నారు.

చుట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షులు, పూలు, పండ్ల తోటలతో ప్రకృతిమయంగా తన ఇంటిని నిర్మించుకున్నారు కృష్ణ. ఇంట్లో అడుగడుగునా ఆయన అభిరుచి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే.. పచ్చని చెట్లు, మధ్యలో శ్రీకృష్ణుడి విగ్రహం.. వాటర్ ఫౌంటెన్.. దాని చుట్టూ గులాబీ, కొబ్బరి చెట్లు.. ఆ పక్కనే విజయనిర్మల గారి విగ్రరం ఇలా అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఇంటిని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

ఇంటి వెనకాలే మామిడి తోట, ఆకుకూరలు, చెట్లు కూడా ఉన్నాయి. ఫ్యామీలీ మొత్తం కలిసి సరదాగా గడపడానికి గార్డెన్ లో, ఇంట్లో స్పెషల్ సిట్టింగ్ ఎరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఇంటి లోపల హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అలానే ఇంట్లోనే పార్టీ చేసుకోవడానికి అన్ని హంగులతో హాల్ ని నిర్మించుకున్నారు. పిల్లల కోసం స్పెషల్ గా ప్లేయింగ్ రూమ్స్ ఉన్నాయి.

లివింగ్ రూమ్ లో విజయనిర్మల ఫొటోలు, విగ్రహాలు, బంగారంతో చేయించిన ఆమె కాళ్లు.. కృష్ణ గెలుచుకున్న పథకాలు ఇలా అన్నింటినీ చూపించారు మంజుల. లివింగ్ రూమ్ వరకే చూపించి ఫస్ట్ ఫ్లోర్ లో నాన్న ఉంటారని.. ప్రస్తుతానికి అక్కడికి నో ఎంట్రీ అని చెప్పారు. కుదిరితే ఫ్యూచర్ లో చూపిస్తానని చెప్పారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus