Supritha: కన్నీళ్లు పెట్టుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత.. వీడియో వైరల్!

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి అందరికీ సుపరిచితమే. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ అనే టీవీ షోతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సురేఖ వాణి .. అదే షో దర్శకుడు అయిన సురేష్ తేజని పెళ్లి చేసుకుంది. వీరికి సుప్రీత ఒక్కరే సంతానం. అయితే 2019 లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె డిప్రెషన్ కు గురైంది. సినిమాలకు కూడా దూరమైంది. ఈమె నటించాల్సిన చాలా సినిమా అవకాశాలను చేజార్చుకోవాల్సి వచ్చింది.

అయితే కూతురి కోసం ఈమె త్వరగానే కోలుకుంది. ఆ తర్వాత కూతురి భవిష్యత్తుని చక్కదిద్దాలని ఈమె కోరుకుంటుంది. సుప్రీతని సినీ పరిశ్రమకి తీసుకురావడం సురేఖకి ఇష్టం లేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే సుప్రీతకి మాత్రం సినిమాల్లోకి రావాలనే ఆశ ఉంది. అందుకోసం సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ చేస్తూ ఉంటుంది. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో (Supritha) సుప్రీతకి లక్షల్లో ఫాలోవర్స్ సంఖ్య ఉంది.

ఒక్క సినిమాలో కూడా నటించకుండా ఆ రేంజ్లో క్రేజ్ ను సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అలాగే తన తల్లితో కలిసి ఈమె చేసే డాన్స్ వీడియోలు కూడా చాలా ఫేమస్. ఇదిలా ఉండగా.. ఆగస్టు 10 న సుప్రీత పుట్టినరోజు. ఈసారి తన పుట్టినరోజును తల్లితో కలిసి అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడి రోడ్ల పై సుప్రీత తన తండ్రితో ఉన్న ఫోటోని డిస్ప్లే చేయించి సర్ప్రైజ్ చేసింది సురేఖ. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus