విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరు. స్టార్ ప్రొడ్యూసర్ రామా నాయుడు గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగారు. ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా ఒదికిపోయే నటుడు వెంకటేష్ అనడంలో అతిశయోక్తి లేదు. అయితే వెంకీ నటించిన సినిమాల్లో చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు ఉన్నాయి. దీంతో ఆ రోజుల్లో కూడా వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కార్లలో వచ్చి సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి.
ఎంత ఫ్యామిలీ సినిమాలు చేసిన మిగతా సెక్షన్ ఆడియన్స్ ను వెంకీ డిజప్పాయింట్ చేసేవాడు కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ వెంకీ సినిమాల్లో ఉండేవి.రెండు, మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా వెంకీ ఖాతాలో ఉన్నాయి. అయితే వెంకీ స్టార్ హీరో అవ్వడానికి అతని అన్న, ప్రముఖ నిర్మాత, రామానాయుడు గారి పెద్దబ్బాయి సురేష్ బాబు కూడా ఉన్నాడు అన్నది అక్షర సత్యం.వెంకీ అప్పటివరకు సురేష్ బాబు గీసిన గీత దాటింది లేదు.
కానీ మొదటిసారి సురేష్ బాబు మాట కాదని వెంకీ చేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా అంటే అది రానా నాయుడు సిరీస్ అనే చెప్పాలి. అవును ఈ సిరీస్ లో వెంకీ నటించడం సురేష్ బాబుకి అస్సలు ఇష్టం లేదు. ‘నీ ఇమేజ్ ను కించపరిచే పాత్ర అది’ అంటూ సురేష్ బాబు … వెంకీతో ముందుగానే చెప్పారట. కానీ రానా పట్టుబట్టడం.. అతనితో నటించాలనే కోరిక వెంకీ కి కూడా ఉండడంతో రానా నాయుడు సిరీస్ లో నటించాడట వెంకీ.
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?