విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నారప్ప’ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒరిజినల్ సినిమా ‘అసురన్’ చూడని ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన మొదట లేదని.. కానీ ఇప్పుడు పరిస్థితుల కారణంగా రిలీజ్ చేయాల్సి వచ్చిందంటూ నిర్మాత సురేష్ బాబు చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, సాటిలైట్ హక్కులు మొత్తం కలుపుకుంటే రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దీని వలన నిర్మాతకు దాదాపు రూ.17 కోట్ల లాభం వచ్చిందట. ఈ సినిమాలో భారీ సెట్లు, ఫారెన్ లొకేషన్స్ లాంటివి ఉండవ్ అందుకే నిర్మాతకు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువే అయింది. ఆర్టిస్ట్ ల రెమ్యునరేషన్ తప్పించి మిగిలినదంతా మీడియం బడ్జెట్ లోనే తీసేశారు.
దీంతో సురేష్ బాబుకి భారీ లాభాలు వచ్చాయి. ఒక్క సినిమాతోనే పదిహేడు కోట్లు లాభం అందుకున్నాడు. తన తదుపరి సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేయాలనీ చూస్తున్నాడు సురేష్ బాబు. ‘దృశ్యం 2’ అయితే మాత్రం ఓటీటీలో రావడం పక్కా. ‘విరాటపర్వం’ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!